‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్ లో ఇక తను లవ్ స్టోరీ సినిమాలను చేయనని తన వైపు నుంచి వచ్చే ఆఖరి లవ్ స్టోరీ ఇదే అంటూ విజయ్ తన సహజసిద్ధమైన తీరులో చేసిన కామెంట్స్ పై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.


విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు నటించిన సినిమాలు పది సంఖ్య కూడ దాటక పోయినా లవ్ స్టోరీస్ పై ఇలాంటి వైరాగ్యం విజయ్ దేవరకొండకి ఎందుకు వచ్చింది అంటూ చాలామంది ఆశ్చర్య పడుతున్నారు. విజయ్ దేవరకొండ కన్నా చాల పెద్ద అయిన జూనియర్ ప్రభాస్ చరణ్ మహేష్ లు ఇంకా లవ్ స్టోరీ సినిమాలలో నటిస్తూ ఉంటే విజయ్ కి వచ్చిన అభ్యంతరం ఏమిటి అంటూ కొందరు ఈ యంగ్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. 


ఒక యంగ్ హీరో క్రేజీ హీరోగా మారాలి అంటే అబ్బాయిలతో పాటు అమ్మాయిలలో కూడ విపరీతమైన క్రేజ్ ఉండాలి. ముఖ్యంగా చాలామంది అమ్మాయిలు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరోలనే ఇష్ట పడతారు. కాలం ఎంత మారిపోయినా లవ్ స్టోరీలను సగటు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. 


ఇలాంటి వాస్తవ విషయాలు పరిగణలోకి తీసుకోకుండా విజయ్ ఆవేశంగా ఎందుకు ఇలా ప్రకటించాడు అంటూ విజయ్ అనుభవ రాహిత్యం పై మరికొందరు తప్పు పడుతున్నారు. ఈ పరిస్థితులలో రాశి ఖన్నా లాంటి హీరోయిన్ కూడ విజయ్ లవ్ స్టోరీస్ లో నటించకపోతే విజయ్ కు ఉండే అమ్మాయిల ఫాలోయింగ్ తగ్గిపోతుంది అంటూ ఓపెన్ గా జోక్ చేస్తున్న పరిస్థితులలో లిప్ లాక్ సీన్స్ సినిమాలకు ప్రేమ కథలకు తేడా తెలియక విజయ్ ఇలా ఆవేశంగా ప్రకటించాడు అని మరి కొందరు అతడి మాటలకు వత్తాసు పలుకుతున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: