ప్ర‌తి మినిషి ప్రేమలో త్యాగం ఉంటుంది. ప్రేమలో రాజి తత్వం ఉంటుంది. ప్రేమలో దైవత్వం ఉంటుంది. ప్రేమలో ఆరాధాన ఉంటుంది. అదే ప్రేమ‌ల ఒక‌రిపై మ‌రొక‌రికి అంతేలేని ఇష్టం ఉంటుంది.. గౌరవం ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో గిల్లి క‌జ్జాలు ఉంటాయి. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ తాజా సినిమా విష‌యానికి వ‌స్తే ఈ సినిమాలో కూడా పైన చెప్పుకున్న కాన్సెఫ్ట్ తోనే ద‌ర్శ‌కుడు క్రాంతి మాధ‌వ్ తెరకెక్కించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చగా.. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

 

ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక ద‌శ‌లో ప్రేమ అనేది ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. కొందరు యుక్తవయసులో ప్రేమలో పడితే మరి కొందరు స్కూల్ ప్రేమలో పడతారు. మరికొందరు కాలేజి లో చదువుతున్నప్పుడు లేదా ఉద్యోగ సమయంలోనూ ప్రేమలో పడటం సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే ప్రేమలో పడి కొన్ని కారణాల వల్ల జరిగితే కొందరు చాలా సింపుల్ గా తీసుకుంటారు. మరికొందరు మాత్రం తీవ్రమైన ఆవేదనలో స‌ర్వ‌స్వం కోల్పోతారు.

 

ఇక వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమాలో కూడా బ్రేకప్ తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ విధమైన మనోవేదన అనుభవిస్తారనేది చూపించారు. సినిమా ప్రారంభమే విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా బ్రేకప్ ఎపిసోడ్ తో ప్రారంభమౌతుంది. ఇక క‌థ అక్క‌డ నుంచి ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని ఇల్లందు నేపథ్యంలో కి వెళుతుంది. అక్క‌డ విజయ్ దేవరకొండ ఐశ్వర్య రాజేష్ మధ్య వచ్చే ఎపిసోడ్ వినోదాత్మకంగానూ, అదే సమయంలో హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతోనూ దర్శకుడు తెరకెక్కించారు.

 

ఇక ప్యారీస్ ఎపిసోడ్‌లో అక్క‌డ అందాల‌ను తెర‌పై చ‌క్క‌గా ఆవిష్క‌రించారు. ఏదేమైనా అర్జున్‌రెడ్డి సినిమా త‌ర్వాత విజ‌య్ ఇంకా ఫ్లేవ‌ర్ నుంచి బ‌య‌ట‌కు అయితే రావ‌డం లేద‌న్న‌ది స్ప‌ష్టంగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: