‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఇక ఇండస్ట్రీ వర్గాల దృష్టి అంతా వచ్చే వారం విడుదల కాబోతున్న యంగ్ హీరో నితిన్ నటిస్తున్న ‘భీష్మ’ మూవీ పై పడింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి రిలీజైన ప్రమోషనల్ మెటీరియల్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈమూవీ గ్యారంటి హిట్ అన్న ప్రచారం జరుగుతోంది. 


దీనితో ఈ సినిమాకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కలిసి వస్తుంది అంటూ అంచనాలు వస్తున్నాయి. ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడానికి నితిన్ చాల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ పనులను వేగం పెంచాడు. 


రష్మిక తో కలిసి నితిన్ అప్పుడే ఛానల్స్ కు ఇంత్వర్వ్యూలు కూడ ఇచ్చేస్తున్నాడు. ఈ ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకు నితిన్ సమాధానం ఇస్తూ రష్మిక కు ఉన్న ఒక విచిత్రమైన అలవాటును బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. సహజంగా అందరు ఆకలి వేస్తే ఫ్రూప్ట్స్ బిస్కెట్స్ చిప్స్ టిఫిన్ వంటివి తింటారు. అయితే రష్మిక మాత్రం కుక్క బిస్కట్లు తినడం అంటే ఎంతో ఇష్టం అని అంటున్నాడు.


ఈ విచిత్రమైన అలవాటు ఆమెకు చిన్నతనలో ఏర్పడిందట. రష్మిక పెంపుడు కుక్కకు ఆమె చిన్నతనంలో కుక్క బిస్కెట్లు పెడుతూ అవి ఎలా ఉంటాయో అప్పట్లో రుచి చూసిన రష్మిక కు ఇప్పటికీ కుక్క బిస్కెట్ల పై మోజు పోలేదట. ఈ విషయం తనకు రష్మిక చెప్పడంతో తెలిసింది అంటూ నితిన్ జోక్ చేయడం ఆమెకు గత జన్మలో కుక్క అయి ఉంటుంది అంటూ జోక్ చేసి అందర్నీ నవ్వించాడు. ఈ విషయాలు నితిన్ చెపుతుంటే రష్మిక అడ్డు పడటానికి ప్రయత్నిస్తూ చేసిన పనులకు నితిన్ లెక్క చేయకుండా రష్మిక విచిత్ర అలవాటును బయట పెట్టాడు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: