టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇటీవల సంక్రాంతి కానుకగా వచ్చిన అలవైకుంఠపురములో సినిమా మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఇకపోతే సినిమా విడుదలకు ముందుగానే యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాలోని థమన్  అందించిన సాంగ్స్ కు శ్రోతల నుండి అత్యద్భుతమైన స్పందన లభించడం జరిగింది. 

 

ఇక మరీ ముఖ్యంగా సామజవరగమనా, రాములో రాముల, బుట్ట బొమ్మ సాంగ్స్ అయితే మరింత బాగా ఆడియన్స్ కు రీచ్ అయ్యాయి. అయితే వాటిలో కొద్దిరోజులుగా బుట్ట బొమ్మ సాంగ్ ని అనుకరిస్తూ కొందరు హీరోయిన్లు సైతం టిక్ టాక్ వీడియోలు చేయడం జరిగింది. ఇక అదంతా ఒక ఎత్తైతే, ఇటీవల కొద్దిరోజలుగా మెమెలు, స్పూఫ్ ల వంటివి యూట్యూబ్ లో బాగా ఎక్కువ అయిపోయాయి. ముఖ్యంగా ఏదైనా సినిమాలోని ఫేమస్ అయిన డైలాగ్ లేదా సాంగ్ ని తీసుకుని, దానిని ఒక కమెడియన్ చేసిన గత సినిమాల్లోని ఫన్నీ సీన్స్ తో అటాచ్ చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నారు. 

 

ఇక ప్రస్తుతం ఆ విధంగా ఈ బుట్ట బొమ్మ సాంగ్ ని ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ వడివేలు తన సినిమాల్లో వేసిన స్టెప్స్ ని జత చేసి కొందరు యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో వేదికగా విపరీతమైన వ్యూస్, లైక్స్ తో దూసుకుపోతోంది. చూడడానికి ఎంతో ఫన్నీగా ఎడిట్ చేయబడిన ఈ సాంగ్ వీడియో చూస్తే నిజంగా మన పొట్టచెక్కలవ్వకమానదు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఆ వీడియో పై ఒక లుక్ వేసి ఎంజాయ్ చేయండి....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: