ప్రతివారం సినిమా ప్రేక్షకులను అలరించడానికి బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కేవలం బాక్సాఫీస్ వద్ద హీరోల సినిమాలు విడుదలై అలరించడమే కాదు.. హీరోల వివాదాలు కూడా హాట్ టాపిక్ గా మారి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ వారంలో తెలుగు తెరపై బాగా వివాదాస్పదమైన హీరోలు ఇద్దరు ఉన్నారు. వారే యువ హీరోలు అయినా నాగ శౌర్య.. విజయ్ దేవరకొండ. నాగ శౌర్య...  హీరోగా రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అశ్వద్ధామ. 

 

 

 అయితే ఎప్పుడు లవర్ బాయ్ గా ప్రేక్షకులను అలరించే నాగశౌర్య ఈ సినిమాలో యాక్షన్ హీరో గా కనిపించాడు. గడ్డం బాగా పెంచుకుని తన లుక్ ను కూడా మార్చుకున్నాడు. ఇక ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు నాగ శౌర్య. కానీ ఈ సినిమా నాగ శౌర్య కు నిరాశే మిగిల్చింది. దీంతో నాగ శౌర్య డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తానే కథ రాసుకుని స్క్రిప్టు రెడీ చేసి తన పేరు వేసుకోలేదు అని.. అదే నేను చేసిన తప్పు అంటూ నాగశౌర్య వ్యాఖ్యానించాడు... దీనిపై డైరెక్టర్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. 

 

 

 ఇకపోతే... విజయ్ దేవరకొండ కూడా ఈ వారం వివాదాల్లో నిలిచాడు. విజయ్ దేవరకొండ హీరో గా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ కెరీర్లోనే డిజాస్టర్ గా మిగిలిపోయింది వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా. అయితే ఈ సినిమా విషయంలో దర్శకుడు విజయ్ దేవరకొండ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ దేవరకొండ ఈ సినిమాను పట్టించుకోకపోవడంతోనే  ఈ సినిమాకు అంత ఆదరణ లభించలేదని.. విజయ్ దేవరకొండ వల్లే ఈ సినిమా హిట్ కాలేకపోయింది అంటూ దర్శకుడు వ్యాఖ్యానించాడు ఇలా ఈ వారం ఈ ఇద్దరు హీరోలు వివాదాల్లో  టాప్  గా  నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: