టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా వ‌చ్చే యేడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. ఇక ఈ సినిమా హీరోయిన్‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి.



అరవింద సమేత చిత్రంలో నటించిన పూజా హెగ్డేను మళ్లీ రిపీట్‌ చేయబోతున్నట్లుగా కొందరు.. కాదు రష్మికను త్రివిక్రమ్‌ ఈ ప్రాజెక్ట్‌ కోసం తీసుకుంటున్నార‌ని మ‌రి కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. ఇక స‌మంత పేరు కూడా మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. గ‌తంలో ఎన్టీఆర్ - స‌మంత కలిసి మూడు సినిమాలు చేశారు. ఇక అటు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కూడా స‌మంత మూడు సినిమాలు చేయ‌డంతో ఈ ప్రాజెక్టులో స‌మంత క‌న్‌ఫార్మ్ అని కొంద‌రు అంటున్నారు.



స‌మంత‌తో త్రివిక్ర‌మ్ చ‌ర్చ‌లు కూడా జ‌రిపాడ‌ట‌. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ప్రాధాన్యం నేప‌థ్యంలో స‌మంత లాంటి న‌టి అయితే క‌రెక్ట్‌గా సూట్ అవుతుంద‌ని త్రివిక్ర‌మ్ భావిస్తున్నాడ‌ట‌. ఏదేమైనా ఎన్టీఆర్‌- త్రివిక్ర‌మ్ ప్రాజెక్టు అధికారికంగా ప్ర‌క‌టించిన వెంట‌నే హీరోయిన్ విష‌యంలో పెద్ద గంర‌ద‌గోళ‌మే న‌డుస్తోంది. అటు స‌మంత‌, ఇటు ర‌ష్మి, మ‌రో వైపు పూజా హెగ్డే అంటూ ర‌క‌ర‌కాల పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చాయి.



మ‌రి ఫైన‌ల్‌గా ఎన్టీఆర్ ప‌క్క‌న హీరోయిన్‌గా న‌టించే ఆ ల‌క్కీ ఛాన్స్ ఎవ‌రు ద‌క్కించుకుంటారో ?  చూడాలి. మొత్తానికి ఈ క్రేజీ ప్రాజెక్టు హీరోయిన్‌ ఎవరు అనే కన్ఫ్యూజన్‌ తో ఫ్యాన్స్‌ జట్టు పీక్కుంటున్నారు.  మ‌రి కొంద‌రు మాత్రం ఈ విష‌యం ఇప్ప‌ట్లో తేలేలా లేదు... దీని గురించి మ‌న అన‌వ‌స‌రంగా డిస్క‌ర్ష‌న్లు పెట్టుకుని టైం వేస్ట్ చేసుకోకూడ‌ద‌ని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: