సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే హీరోలకు గిరాకీ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎన్ని విజయాలు సాధిస్తే అంత డిమాండ్ ఏర్పడుతుంది. స్టార్ హీరోలు అయినప్పటికీ స్టార్ హీరోల వారసులు అయినప్పటికీ సక్సెస్ రేట్ ను బట్టి వాళ్ళకి డిమాండ్ ఏర్పడుతోంది. ఒకవేళ సక్సెస్ వచ్చినా ఆ సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ అదే బాటలో నడవడం అంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే ఒక విజయం తర్వాత మరిన్ని విజయాలు అందుకోవాలని అంటే అభిమానుల అంచనాలకు మించి అడుగులు వేయాల్సి ఉంటుంది హీరోలు. అయితే ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయి... ఆ తర్వాత సక్సెస్ కిలోమీటర్ దూరం అయిన హీరోలు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి. 

 

 అక్కినేని అఖిల్ : అక్కినేని అఖిల్ స్టార్ కిడ్ అనే చెప్పాలి. ఎందుకంటే తాతల కాలం నాటి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంది ఈ హీరోకి. చూడటానికి బాగా ఉండడ  అంటే అది కూడా లేదు. అమ్మాయిల మనసులో కొల్లగొట్టే అందం అఖిల్ ది . కానీ అఖిల్ కు మాత్రం ఇప్పటి వరకు సక్సెస్ రాలేదు. సినిమా విజయం అందని ద్రాక్షల మారిపోయింది అఖిల్ కి.దీంతో ప్రస్తుతం సరికొత్త లవ్ యాంగిల్ ని ప్రయత్నిస్తూ ఎమోషనల్ కంటెంట్ తో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో నటిస్తున్నాడు అఖిల్ కు జోడిగా పూజ హెగ్డే  నటిస్తోంది. 

 

 మాస్ మహారాజా రవితేజ : గత కొంతకాలం క్రితం మాస్ ప్రేక్షకుల  ఫేవరెట్ హీరో గా ఉండి . అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ తనదైన కామెడీతో అదిరిపోయే యాక్షన్ తో  వరుస విజయాలను అందుకున్న రవితేజ గత కొంతకాలం క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజా ది గ్రేట్ తర్వాత చేసిన ఏ సినిమా  విజయం సాధించలేదు. ఇక మొన్నటికి మొన్న డిస్కో రాజా సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆ సినిమా కూడా నిరాశనే మిగిల్చింది. ఇక ఇప్పుడు క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుండగా  ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు రవితేజ. 

 

 గోపీచంద్ : మొదటినుంచి మాస్ ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేక క్రేజ్ ను సంపాదించుకున్న హీరో గోపీచంద్. అయితే గోపీచంద్ సక్సెస్ చూసి చాలా ఏళ్లు అయింది అనడంలో అతిశయోక్తిలేదు. ఎన్నో విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ సక్సెస్ మాత్రం సాధించలేకపోతున్నారు గోపీచంద్. ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్ లో ఒక స్పోర్ట్స్ డ్రామా సినిమాలో నటిస్తున్నాడు. మరి ఏ సినిమా అయిన గోపీచంద్ ఫేట్ మారుస్తున్న చూడాలి మరి.

 

 మంచు మనోజ్ : మంచు మోహన్ బాబు  వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ఎన్నో ప్రయోగాలు చేసినప్పటికీ సరైన స్టార్ డమ్ మాత్రం  సంపాదించలేక పోయాడు మంచు మనోజ్. ఇక కరెంట్ తీగ తర్వాత చేసిన ఐదు సినిమాలు కూడా పెద్ద డిజాస్టర్ గానే  మిగిలిపోయాయి. ఇక ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ప్రస్తుతం ఒక సీరియస్ థ్రిల్లర్ తో   తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. 

 

 శర్వానంద్ : కెరీర్ మొదట్లో కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తూ మంచి విజయాలను అందుకున్న శర్వానంద్ శతమానం భవతి మహానుభావుడు సినిమాల విజయం తర్వాత హిట్టుకు  చాలా దూరం అయిపోయాడు శర్వానంద్. పడి పడి లేచే మనసు రణరంగం లాంటి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అవి విజయం సాధించలేకపోయాయి. ఇక ఆ తర్వాత 96 రీమేక్ జాను ప్రేక్షకుల ముందుకు వచ్చిన అది కూడా ఆశించినంత ఫలితం మాత్రం ఇవ్వలేదు. కాగా ప్రస్తుతం వ్యవసాయం కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న శ్రీకారం అనే సినిమా చేస్తున్నాడు శర్వానంద్. మరి ఈ సినిమా ఆయన విజయాన్ని తెచ్చి పెడుతుంది చూడాలి మరి. 

 

 రాజ్ తరుణ్ : కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలను అందుకున్న రాజ్ తరుణ్ ఆ తర్వాత వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు.  ప్రస్తుతం ఒరేయ్ బుజ్జి గా అనే సినిమాతో బిజీగా ఉన్న రాజ్ తరుణ్  ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. 

 

 అల్లరి నరేష్ : కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయి ఎన్నో కామెడీ చిత్రాల్లో నటించిన  అల్లరినరేష్.. సుడిగాడు సినిమా తర్వాత ఎన్ని సినిమాలు చేసినా సరైన హిట్ మాత్రం కొట్టలేకపోయారు. ఇక మొన్నటికి మొన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మహేష్ బాబు సరసన నటించాడు అల్లరి నరేష్. ప్రస్తుతం నాంది అనే సినిమా చేస్తున్న  అల్లరి నరేష్.. సుడిగాలి సినిమా సీక్వెల్ తీసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. 

 

 ఆది : సాయికుమార్ తనయుడుగా సినిమా ఇండస్ట్రీకి వచ్చి రెండు మూడుహిట్లు అందుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం సక్సెస్ కిలోమీటర్ దూరం అయిపోయాడు. వరుసగా ఎనిమిది డిజాస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. 

 

 అల్లు శిరీష్ : అల్లు అరవింద్ వారసుడిగా అల్లు అర్జున్ తమ్ముడిగా తెలుగు ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తనదైన సత్తా చాట లేకపోతున్నాడు అల్లు శిరీష్. వివిధ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసినప్పటికీ అవి కాస్త బెడిసి కొట్టాయి. ప్రస్తుతం అల్లు శిరీష్ రాక్షసుడు డైరెక్టర్ రమేష్ వర్మ ఓ కొత్త ప్రాజెక్ట్ ను సెట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: