ప్రస్తుతం సీనియర్ హీరోలలో బాలకృష్ణ ఎదుర్కుంటున్న విపత్కర పరిస్థితులు ఏ సీనియర్ హీరోకి ఎదురుకావడం లేదు. చిరంజీవి వెంకటేష్ లు వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతూ ఉంటే అదే పద్ధతిని నాగార్జున కూడ అనుసరిస్తున్నాడు. అయితే ఈ లిస్టులో ఇప్పుడు బాలకృష్ణ మాత్రమే విపరీతంగా వెనకపడి ఉన్నాడు. 

 

ప్రస్తుత పరిస్థితులలో బాలయ్యతో కలిసి నటించడానికి హీరోయిన్స్ మాత్రమే కాదు అతడితో సినిమాలు తీయడానికి నిర్మాతలు కూడ వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి బాలకృష్ణ కు ఏర్పడటానికి అతడి వ్యవహార శైలి అన్న మాటలు వినిపిస్తున్నాయి. స్వతహాగా ఇగో ఎక్కువగా ఉండే బాలకృష్ణ మారుతున్న వాస్తవ పరిస్థితులను గ్రహించలేక తన దగ్గరకు వచ్చే నిర్మాతలను ఇంకా తనకు 10 కోట్ల పారితోషికం కావాలి అని పట్టు విడవకుండా చేస్తున్న బేరసారాలు వల్ల బాలయ్యతో సినిమాలు అంటే భయపడుతున్న పరిస్థితి అని అంటున్నారు. 

 

ఈమధ్యనే మొదలైన బోయపాటి బాలకృష్ణ మూవీ షూటింగ్ వరకు తీసుకు రావడానికి బోయపాటి పడరాని పాట్లు పడిన విషయం తెలిసిందే. ఇలాంటి వ్యతిరేక పరిస్థితులలో కూడ ఇద్దరు ముగ్గురు నిర్మాతలు బాలరిష్ణ తో సినిమాలు తీసే సాహసం చేస్తున్నా బాలయ్య మొండిపట్టుదల వల్ల ఆ సినిమాలకు సంబంధించి కథలు ఓకె అయినా ముదుకు అడుగు పడని వరిస్థితి అని అంటున్నారు. దీనితో బాలయ్య వాస్తవాలను గుర్తిస్తే బాగుంటుంది అంటూ అతడి సన్నిహితులు కూడ సలహాలు ఇస్తున్నట్లు టాక్. 

 

అయితే ఈ విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా బాలయ్య మాత్రం తన గత సినిమాల రికార్డులను విజయాలను గుర్తుకు చేసుకుంటూ దర్శక నిర్మాతలతో బేరసారాలు సాగిస్తున్నాడు అని తెలుస్తోంది. దీనికితోడు బాలకృష్ణ తన వయసుకు సరిపడ్డ పాత్రలను ఎంచుకోకుండా తన సినిమాల విషయాలలో చేస్తున్న పొరపాట్లు కూడ బాలయ్యకు శాపంగా మారుతున్నాయి. ఇప్పటికే టాప్ దర్శకులలో ఒక్క బోయపాటి తప్ప మిగతా దర్శకులు అంతా బాలయ్య పేరు చెపితే భయపడిపోతున్న పరిస్థితులలో ఈ నందమూరి వారసుడి పరిస్థితి ఏమిటి అంటూ చర్చలు జరుగుతున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: