బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. అతని సినిమాలను ఇండియన్స్ తో పాటు బంగ్లాదేశీయులు, పాకిస్థానీయులు, ఇరానియన్లు, ఇరాక్ వాళ్లు ఇంకా చాలా ముస్లిం దేశస్థులు చూస్తుంటారు. ఆయా దేశాలలో కూడా షారుక్ ఖాన్ కి కోట్ల మంది అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా అతను ఎటువంటి సన్నివేశానికైనా అద్భుతమైన హావభావాలను చూపించి అసలైన నటనంటే ఏమిటో చూపిస్తాడు. వెండి తెరపైనా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న షారుక్ ఖాన్... దానధర్మాలు చేస్తూ నిజజీవితంలో కూడా చాలా మంచి వాడనే పేరు తెచ్చుకున్నాడు.



ఐతే నిన్న రాత్రి మార్చి ఆరవ తేదీన రిలీజ్ అయ్యే కామ్యాబ్ సినిమాని షారుక్ ఖాన్ ముంబై లోని ఒక థియేటర్ లో చూసారు. మూవీ వీక్షించిన అనంతరం ఆ సిని బృందంతో కలిసి ఫోటోలు దిగడం ప్రారంభించారు. ఆ సందర్భంలోనే అక్కడే నిల్చొని ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్లు షారుఖ్ ఖాన్ ని పిలిచారు. ఏంటా అని షారుక్ ఖాన్ వారి వద్దకు వెళ్లగా... ఓ ఫోటోగ్రాఫర్ మాట్లాడుతూ... సార్ మీకు ఒక గిఫ్టు ఇవ్వాలనుకుంటున్నాను అని చెబుతూ తన చేతిలో ఏదో ఉన్నట్టు నటిస్తూ షారుఖ్ ఖాన్ కు ఒట్టి చేతులు చూపించి అతన్ని ఫూల్ చేస్తాడు. దీంతో ఒక్కసారిగా షారుఖ్ మొహం చిన్నబోతుంది.



ఆపై తానుు కూడా నిజంగానే గిఫ్ట్ తీసుకున్నట్టు నటిస్తూ నేనేం పిచ్చివాడిని కాదని నవ్వుకుంటూ చెబుతూ వెళ్ళిపోతాడు. ఏదేమైనా ఐదు పదుల వయసు దాటినా ఇప్పటికి కుర్రవాడి లాగా ఫిట్నెస్ మెయింటెన్ చేస్తూ ఎంతో మంది యువతుల మనసులను దోచేస్తున్నాడు. ఇకపోతే కామ్యాబ్ కి హార్డీ మెహతా దర్శకత్వం వహించగా, రాధిక ఆనంద్ స్క్రిప్ట్ ని అందించారు. ఈ సినిమాని చూసిన ఓ ప్రముఖ ఫిలిం క్రిటిక్ 3.5 రేటింగ్ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: