మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా నరేష్ ఎన్నికైనప్పటినుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉన్న వివాదాలు సద్దుమణుగుతుంది అని అందరూ అనుకున్నారు. గతంలో శివాజీ రాజా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్న సమయంలో... అసోసియేషన్ సభ్యులు అందరూ రెండు వర్గాలుగా ఏర్పడడంతో వివాదాలు తారా స్థాయికి చేరుకొని తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి మెలిసి ఉండాలని ఎంత సూచించినప్పటికీ... వివాదాలు మాత్రం రగులుతూనే వస్తున్నాయి. 

 

 

 ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నరేష్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకు వివాదాలు తెరమీదికి రానప్పటికీ ఆ తర్వాత.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయినా జీవిత రాజశేఖర్ అధ్యక్షుడు నరేష్ ఇలా రెండు వర్గాలుగా ఏర్పడి మరోసారి వివాదాలు తలెత్తాయి. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వివాదాల్లో  టాలీవుడ్ పెద్దలు జోక్యం చేసుకునేంత  వరకు వెళ్లాయి. ఇదిలా ఉంటే... తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న నరేష్ 41 రోజుల పాటు సెలవు పెట్టారు. ఈ నేపథ్యంలో యాక్టింగ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా సీనియర్ నటుడు బెనర్జీ ఎన్నికయ్యారు. 

 

 

 ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న నరేష్ నలభై ఒక్క రోజుల పాటు సెలవు పెట్టిన నేపథ్యంలో బైలాస్ ప్రకారం కమిటీ బెనర్జీని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణా కమిటీ ఈసీ  సభ్యులు కలిసి బెనర్జీకి అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి రెబల్ స్టార్ కృష్ణంరాజు మురళీమోహన్ జయసుధ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నరేష్ సెలవు నుంచి తిరిగి వచ్చేంతవరకు సీనియర్ నటుడు బెనర్జీ మా అసోసియేషన్ అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: