పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో మోహిని గురించి ఆ క్యారక్టర్ లో అమ్మాయి వేషం వేసింది వేరో తెలుసుగా మన రాకింగ్ స్టార్ మంచు మనోజ్. ఫ్యామిలీ అంతా కలిసి ఈ ఇయర్ కి మంచి కిక్ హిట్ తో మనముందుకొచ్చారు మంచు ఫ్యామిలీ. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇందులో ముఖ్యంగా మోహిని వేషం వేసింది ఎవరో కాదు మంచు మనోజ్. మనోజ్ ని అమ్మాయిలా చూస్తే అదుర్స్ అనిపించాడు.. అంతేకాదు ఆడియెన్స్ కి మంచి జోరందిస్తుంది ఈ క్యారక్టర్. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా చాలా కాలం తర్వాత ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ వేశారు ఈ సినిమాలో. శ్రీ వాస్ దర్శకత్వం వహించిన ఈ పాండవులు పాండవులు తుమ్మెద సినిమా మంచి మౌత్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుంది. ఈ సినిమాతో విష్ణు హ్యాట్రిక్ హిట్ కొట్టాడనే చెప్పాలి.  మనోజ్ ఏ క్యారక్టర్ ఇచ్చినా 100 పర్సెంట్ న్యాయం చేస్తాడని చెప్పడానికి మోహిని క్యారక్టర్ ఒక ఉదాహరణ. మనోజ్ చేసిన మోహిని క్యారక్టర్ ని థియేటర్ లో ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా హిట్ కి సగం భాద్యత మనోజ్ తన మీద వేసుకున్నాడు. మొత్తానికి మన మంచు హీరో లేడీ గెట్ అప్ లో అదుర్స్ అనిపించుకున్నాడు. ఈ సినిమాలో వరుణ్ సందేష్, తనీష్ లు కూడా సపోర్టెడ్ రోల్స్ లో నటించారు.  మోహినిలా చేసిన మనోజ్ పై మీ స్పందన..?

మరింత సమాచారం తెలుసుకోండి: