నాచురల్ స్టార్ నాని సినిమాలు ప్రేక్షకులను బాగా అలరిస్తాయన్న సంగతి మనకి తెలిసిందే. మిడిల్ రేంజ్ హీరో అయిన నాని తన సినిమా కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ప్రతి బంతిని సిక్స్ కొట్టాలని భావించే క్రికెటర్ లాగా ప్రతి సినిమాని హిట్ చేయాలని నాని బాగా వర్క్ అవుట్ చేసి ఏ సినిమానేనా తెరపైకెక్కిస్తాడు. ఐతే ఇంత పక్కాగా తన సినిమాని థియేటర్లలోకి వదిలే నాని సినిమాకి ఇతర లెస్ పాపులారిటీ హీరోల సినిమాలు పోటీ ఇస్తాయా? అని ప్రశ్నిస్తే 'లేదు' అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.



అందుకే నాని సినిమా రిలీజ్ అయ్యే సమయానికి మిగతా సినీ దర్శక నిర్మాతలు వారి సినిమాలను వాయిదా వేసుకుంటారు. కానీ ఈసారి మాత్రం అలా జరగడం లేదు. ఇటీవల కాలంలో యాంకర్ రంగంలో అడుగుపెట్టి బాగా పాపులారిటీ తెచ్చుకున్న ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అని సినిమాలో హీరోగా నటించాడు. దానికి సంబంధించిన ట్రైలర్, పాటలు విడుదలై బాగానే ఆదరణ పొందాయి. అయితే ఈ సినిమా మార్చి 25న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. యూట్యూబ్ లో పాటలు అలరించినా పూర్తి సినిమా వెండి తెరపై అలరిస్తుందో లేదో కానీ నాని నటించిన "వీ" సినిమా రిలీజ్ అయ్యే రోజే అనగా మార్చి 25న ప్రదీప్ ఫస్టు సినిమా రిలీజ్ అవ్వుతుండటం అందర్నీ షాక్ కి గురిచేస్తుంది.



అసలే ప్రదీప్ కు నటించడం కొత్త, మళ్ళీ 30 రోజుల్లో ప్రేమించడమెలా అనే బోరింగ్ రొమాంటిక్ థీమ్ కథతో వస్తుండటం చాలా మైనస్ అని అందరూ భావిస్తుంటే నాని సినిమాకి పోటీగా తన సినిమాని విడుదల చేయడం సిద్దమవుతున్నాడు. ఏది ఏమైనా అది సరైన నిర్ణయం కాదని నెటిజన్లు చెవులు కోరుకుంటున్నారు. మరోవైపు ఎప్పుడో ఓ హిట్టు సాధించిన రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఈ సినీ బృందం కూడా మార్చ్ 25న విడుదలకి ముహూర్తం పెట్టుకుంది. సో ఈ రెండు సినిమాలు నాని 'వీ' మూవీ ని ఖాతరు కూడా చేయకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: