‘చెప్పను బ్రదర్’ అంటూ గతంలో అల్లు అర్జున్ ఓపెన్ గా చేసిన కామెంట్స్ తో పెరిగిపోయిన బన్నీ పవన్ ల మధ్య దూరం ఈమధ్యనే కాస్త తగ్గింది. దీనికితోడు వచ్చే ఏడాది పవన్ అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలో ఒక మూవీ చేయబోతున్నాడు అని వార్తలు రావడంతో పవన్ బన్నీ ల మధ్య దూరం పూర్తిగా తగ్గిపోయింది అని భావించారు అంతా.


అయితే ఇప్పుడు అనుకోకుండా ‘వకీల్ సాబ్’ మళ్ళీ పవన్ బన్నీ ల అభిమానుల మధ్య చిచ్చు పెడుతోంది. ‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్ విడుదల కాగానే జోష్ లోకి వెళ్ళిపోయిన పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోతు ఈ మూవీతో ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయం అంటూ కామెంట్ చేయడమే కాకుండా ‘అల వైకుంఠపురములో’ రికార్డులను ‘వకీల్ సాబ్’ బ్రేక్ చేస్తుంది అంటూ బన్నీ అభిమానులను పవన్ అభిమానులు కెలకడం మొదలు పెట్టారు.


ఇది చాలదు అన్నట్లుగా ఇప్పుడు పవన్ అభిమానులు ఒక సరికొత్త ప్రచారం మొదలుపెట్టి అల్లు అర్జున్ అభిమానులను మరింత రెచ్చగొడుతున్నారు. మొన్న ఉమెన్స్ డే సందర్భంగా విడుదలైన ‘వకీల్ సాబ్’ మూవీలోని ‘మగువా మగువా’ పాట లిరికల్ సాంగ్స్ ట్రెండింగ్ లో ఉంది అంటూ మెసేజ్ లు పెడుతూ అత్యథిక వేగంగా 400K లైక్స్ పొందిన వీడియో తమదేనంటూ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. కేవలం 11 గంటల్లోనే ‘మగువా మగువా’ లిరికల్ సాంగ్ కి 400K లైక్స్ వచ్చాయని అదే ‘రాములో రాములా’ సాంగ్ కి ఆమాత్రం లైక్స్ రావడానికి 48గంటలు పట్టిందని అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


అంతేకాదు ‘మగువా మగువా’ పాట రికార్డులు ‘సామజవరగమనా’ రికార్డులకు చెక్ పెడతాయి అంటూ పవన్ వీరాభిమానులు అల్లు అర్జున్ అభిమానులను మరింతగా రెచ్చగొడుతున్నారు. దీనితో బన్నీ అభిమానులు రెచ్చిపోయి ‘వకీల్ సాబ్’ విడుదల అయ్యాక ఈ మూవీ రికార్డుల గురించి మాట్లాడుకుందాము అంటూ సవాల్ విసురుతున్నారు. ఇలా కొనసాగుతున్న పవన్ బన్నీ అభిమానుల మధ్య జరుగుతున్న ఈ నెగిటివ్ కామెంట్స్ వార్ ‘వకీల్ సాబ్’ కు హాని చేస్తుందా అంటూ దిల్ రాజ్ భయపడి పోతున్నట్లు టాక్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: