కరోనా వైరస్ ప్రంచంలోని అనీ దేశాలకు విస్తరిస్తూ అందర్నీ వణికిస్తోంది. ప్రస్తుతం ఈ వైరస్ భయం యూరప్ లో చాల ఎక్కువగా ఉంది. ఇటలీలో బయటకు వస్తే జైలుకు పంపుతాము అంటూ ఆంక్షలు విధిస్తున్న పరిస్థితులలో ప్రభాస్ ఇవేమీ పట్టించుకోకుండా యూరప్ వెళ్ళడమే కాకుండా అక్కడ తన లేటెస్ట్ మూవీ షూటింగ్ కొనసాగించడం టాప్ న్యూస్ గా మారింది.


యూరప్ లోని జార్జియాలో ప్రభాస్ జిల్ రాథా కృష్ణుల మూవీ షూటింగ్ చాల వేగంగా జరుగుతోంది. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక ఛేజింగ్ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు దర్శకుడు రాథా కృష్ణ మీడియాకు తెలియచేసాడు. అయితే ప్రభాస్ ఎవర్ని ఛేజ్ చేసాడు అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అని అంటున్నారు.


ప్రస్తుతం యూరప్ లో నెలకొన్న పరిస్థితుల రీత్యా ప్రభాస్ టీమ్ ను షూటింగ్ నిమిత్తం తమ దేశానికి వచ్చే ఆలోచనలను వాయిదా వేసుకోమని జార్జియా దేశంలోని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తమ గురించి అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటాము అంటూ ఈమూవీ నిర్మాతలు హామీ ఇవ్వడంతో ఈ షూటింగ్ కు అనుమతులు ఇచ్చినట్లు టాక్. యూరప్ వెళ్ళిన ప్రభాస్ టీమ్ లో ఒక డాక్టర్ తో పాటు ఇద్దరు చెఫ్ లు కూడ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 


ఒకవైపు కరోనా దెబ్బకు మనదేశంలో చాల రాష్ట్రాలలో ధియేటర్లు మూతపడిపోతు ఉంటే ప్రభాస్ మాత్రం ధైర్యంగా కరోనా విలయ తాండవం చేస్తున్న యూరప్ లోకి వెళ్లి షూటింగ్ చేయడం ప్రభాస్ మొండితనాన్ని సూచిస్తోంది. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే మరికొన్ని వారాల పాటు యూరప్ లోనే ఉండి కీలక సన్నివేశాలు పూర్తి చేయాలని ప్రభాస్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు టాక్. ఈ మూవీ షూటింగ్ కోసం జార్జియా వచ్చిన ప్రభాస్ టీమ్ కు అక్కడి ఎయిర్ పోర్ట్ లో గంటల తరబడి పరీక్షలు చేసినా ప్రభాస్ నవ్వుతు సహకరించినట్లు టాక్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: