బాలకృష్ణ బోయపాటిల కాంబినేషన్ లో ఇప్పటికే ప్రారంభం అయిన మూవీ హ్యాట్రిక్ విజయం సాధించి బాలయ్య కష్టాలను తీరుస్తుందని అతడి అభిమానులు గంపెడు ఆశలతో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ పై ఒక నెగిటివ్ సెంటిమెంట్ ప్రచారంలోకి రావడం బాలయ్య అభిమానులకు షాక్ ఇస్తోంది. 


తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో బాలయ్య కవల పిల్లల పాత్రలో ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. కొద్ది క్షణాల గ్యాప్ తో ఒక తల్లికి పుట్టిన ఈ కవలలు కొన్ని అనుకోని కారణాలు వల్ల విడిపోయి గ్రహాల ప్రభావంతో ఒక బిడ్డ కాశి లోని అఘోరాగా మారిపోతే మరొక బిడ్డ ఫ్యాక్షనిస్ట్ గా మారిపోతాడు. ఈ రెండు పాత్రలు సింక్ చేస్తూ బోయపాటి చాల డిఫెరెంట్ గా స్క్రీన్ ప్లే వ్రాసినట్లు తెలుస్తోంది.  


ఈ చిత్రాన్ని వారణాసి రాయలసీమ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తీస్తున్నారు అయితే  గతంలో బాలకృష్ణ కవల సోదరులుగా నటించిన ‘సుల్తాన్’, ‘అల్లరి పిడుగు’  సినిమాలు అన్నిఫెయిల్ అయ్యాయి. దీనితో బాలకృష్ణ ద్వి పాత్రాభినయం చేసిన సినిమాలు హిట్ అయ్యాయి కాని కవల సోదరులుగా నటించిన సినిమాలు అన్ని ఫెయిల్ అయ్యాయి అన్న కొత్త సెంటిమెంట్ ప్రచారంలోకి వచ్చింది.  


ఇప్పడు ఈ వార్తలు అన్ని బాలయ్య అభిమానుల దృష్టి వరకు రావడంతో తాము ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ పై ఈ నెగిటివ్ కి సెంటిమెంట్ ప్రచారం ఏమిటి అని తల పట్టుకుంటున్నట్లు టాక్. ఈ సినిమాలో బాలయ్య తన లుక్ ను డిఫరెంట్ గా చూపించడం కోసం గుండుతో నటించడమే కాకుండా ఏకంగా తన శరీర బరువును 15 కేజీలు తగ్గించు కోవడం కోసం చాల కష్టపడ వలసి వచ్చింది అని అంటున్నారు. ఈ మూవీలో విలన్ పాత్రలో నటిస్తున్న శ్రీకాంత్ బాడీ లాంగ్వేజ్ చాల డిఫరెంట్ గా ఉండే విధంగా బోయపాటి ప్రత్యేక శ్రద్ద తీసుకుని తీర్చి దిద్దుతున్నట్లు టాక్..  

మరింత సమాచారం తెలుసుకోండి: