తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ వున్న విషయం తెలిసిందే. హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా రోజురోజుకు అభిమానులను  పెంచుకుంటూ పోతూ ఉంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే.. జనసేన పార్టీని స్థాపించి జనసేన కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అయితే మొదట్లో అటు రాజకీయాలనూ ఇటూ  సినిమాలను బ్యాలెన్స్ చేసినప్పటికీ... అజ్ఞాతవాసి సినిమా తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్లారు. ఇక రెండేళ్ల తర్వాత ప్రస్తుతం వకీల్ సాబ్  అనే సినిమాతో సినిమాల్లోకి  రీ  ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. 

 

 

 బాలీవుడ్ హిట్ మూవీ పింక్  రీమేక్ ని తెలుగులో వకీల్ సాబ్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇక రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం తో దర్శక నిర్మాతలందరూ పవన్ కళ్యాణ్ దగ్గరికి కొత్త కథలతో క్యూ కట్టారు. ఈ నేపథ్యంలోనే ఏకంగా వరుసగా నాలుగు సినిమాలకు సైన్ చేసినట్లుగా గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్  సినిమాతో పాటు... క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యాడు. అయితే దర్శకుడు క్రిష్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్  టైపు పాత్రలో కనిపిస్తాడని గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 

 

 

 ఇక ఈ సినిమా చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి తెలుగు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  అభిమానుల్లో  రోజురోజుకు ఈ సినిమా పై మరింత ఆసక్తి పెరిగి పోతోంది. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించేందుకు దర్శకుడు క్రిష్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ లుక్  హల్చల్ చేస్తోంది. న్యూ లుక్ చిత్ర బృందం నుంచి లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ కొత్త లుక్ అభిమానులను అలరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: