తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. యువ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా చాలామంది ఉన్నారు. కానీ అమ్మాయిల మనసు దోచిన లవర్ బాయ్స్ మాత్రం కొంత మంది ఉన్నారు. ఇలా అమ్మాయిల మనసులు దోచిన వారిలో నేటితరంలో ముందుగా వరుసలో ఉండే హీరో  విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తక్కువ సమయంలోనే ఎక్కువ స్టార్డమ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ. తనకంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు. ఇక ఎంతోమంది మగువల మనసులను కొల్లగొట్టాడు విజయ్ దేవరకొండ. కేవలం సినిమాల్లోనే కాదు బయట కూడా తనదైన ఆటిట్యూడ్ తో ... యువతుల గుండెల్లో బాణాలు దింపేశాడు. 

 

 

 పెళ్లిచూపులు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన విజయ్ దేవరకొండ ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేసిన అర్జున్ రెడ్డి సినిమా తో ఒక్కసారిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ  చూపు  మొత్తం ఆకర్షించాడు. అప్పటివరకు సాదాసీదా హీరోగా ఉన్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి  సినిమాతో సెన్సేషనల్ హీరోగా మారిపోయాడు. ఇక ఆ తర్వాత విజయ్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళి పోయింది. ఇక అర్జున్ రెడ్డి తర్వాత వచ్చిన టాక్సీవాలా,  గీతగోవిందం సినిమాల తో మరింత క్రేజ్ సంపాదించి ఏకంగా వంద కోట్లు హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఇక అర్జున్ రెడ్డి సినిమా నుంచి విజయ్ కు  అమ్మాయిలు క్రేజ్ బాగా పెరిగిపోయింది. 

 

 

 ప్రస్తుతం విజయ్ ని చూస్తే చాలు అనుకునే అభిమానులు ఎంతో మంది.. ఇక విజయ్ దేవరకొండతో ఒక్క సినిమాలో నటించిన చాలు అనుకునే హీరోయిన్లు కూడా ఉన్నారు. ఏకంగా బాలీవుడ్ హీరోయిన్స్ కూడా చాలామంది టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ అంటే తమకు ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో నటించిన కియారా అద్వానీ సైతం ఓ మీడియా సమావేశంలో విజయ్ దేవరకొండ అంటే ఎంతో  ఇష్టమంటూ  చెప్పింది. ఇలా విజయ్ తో సినిమా అంటే హీరోయిన్లు సైతం పిచ్చెక్కి పోతుంటారు. అందుకే నేటి తరం లవర్ బాయ్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ.

మరింత సమాచారం తెలుసుకోండి: