తెలుగు రాష్ట్రాల్లో విజయ్ దేవరకొండ ఒక సెన్సేషన్. ' వాట్సాప్ వాట్సాప్ మై రౌడీ బాయ్స్ ' అంటూ యువతలో మంచి రౌడీ క్రేజ్ ను ఏర్పరుచుకున్నాడు. మాస్ లుక్, రౌడీ యాటిట్యూడ్, డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ విజయ్ దేవరకొండ సొంతం. 

 

నాటకాల్లో బాగా రాణించిన విజయ్, నువ్విలా సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేశాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో కూడా చిన్న పాత్ర పోషించాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలోని రిషి పాత్రతో ప్రసిద్ధి చెందారు ఆయన. పెళ్ళి చూపులు సినిమాలో హీరో పాత్రలోని ఆయన నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకున్నారు విజయ్. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది.

 

పరిచయం సినిమాతో పూర్తి స్థాయి హీరోగా నటించిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు పొందాడు. ఈ సినిమా తో విజయ్ హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అర్జున్‌ రెడ్డి సినిమాతో సూపర్‌హిట్‌ కొట్టిన విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్టార్‌ హీరో అయిపోయాడు.

 

తరువాత వచ్చిన గీత గోవిందం కూడా విజయాన్ని అందుకోవడంతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన టాక్సీ వాల, డియర్ కామ్రెట్ సినిమాలతో హిట్లను అందుకున్నాడు. తనని తాను రౌడిగా, యువతలో రౌడీ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో విజయ్.

ఎప్పుడు భిన్న పాత్రలు పోషిస్తూ, ఇటూ కుటుంబ సమేత సినిమాలు తీస్తూ.. రౌడీ నటనతో యువతను అలరించేవాడు. ఇటీవల విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ నీ తన నటన శైలితో సొంతం చేసుకున్నాడు.

 

అటు విమర్శకులు, ఇటు ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో విజయ్ ఒక్కడు. దర్శకులు, నిర్మాతలు సైతం విజయ్ దేవరకొండ తో సినిమాలు తీయడానికి క్యు కడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: