టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమయ్యాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మొదటి సినిమా అల్లుడు శీను తో  మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు... కానీ ఆ తర్వాత విజయం సాధించలేకపోయాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రేక్షకుల ఆదరణ మాత్రం పొందలేకపోయాడు. ఇక ఎన్నో కమర్షియల్ సినిమాల తర్వాత... గత ఏడాది రాక్షసుడు అనే డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. దీంతో భారీ విజయాన్ని అందుకున్నాడు సాయి శ్రీనివాస్. 

 

 

 ఇక ఈ సినిమా హిట్ తర్వాత సినిమా కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈ యువహీరో. అందులో భాగంగానే కథల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తూ కాస్త గ్యాప్ తీసుకొని మంచి కథతో ముందుకు రాబోతున్నాడు. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా అంటే కాస్టింగ్ భారీగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు. ఐటెం సాంగ్స్ విషయంలో కూడా భారీ తారాగణం కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న అల్లుడు అదుర్స్ సినిమా కోసం కూడా ఓ క్రేజీ హీరోయిన్ ఐటమ్ సాంగ్ ఉండనుంది అని తెలుస్తోంది. 

 

 

 అయితే అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసే  హాట్బ్యూటీ ఎవరో కాదు నిధి అగర్వాల్. సవ్యసాచి సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ఆ తర్వాత మిస్టర్ మజ్ను ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్... ప్రస్తుతం వరుస అవకాశాలు చేజిక్కుంచుకుని  బిజీబిజీగా గడుపుతోంది. అయితే ఈ హాట్ బ్యూటీ తో అల్లుడు అదుర్స్ సినిమాలో ఓ ఐటెం సాంగ్  చేయాలని చిత్రబృందం భావిస్తోందట. ఇక ఈ ఐటమ్ సాంగ్ లో చేయడానికి ఏకంగా 80 లక్షల పారితోషికాన్ని ఆఫర్ చేసిందట చిత్రబృందం. దీంతో నిధి అగర్వాల్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: