ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే ప్రకటించేశారు. అయితే టైటిల్ ఏం పెడతారబ్బా ? అని నిన్న మొన్నటి వరకు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తోన్న ప్రపంచ సినీ అభిమానులకు రాజమౌళి ఉగాది కానుకగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చేశారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య రు. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ఈ యేడాది జూన్ లేదా జూలైలో రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు.
https://www.youtube.com/watch?v=lDVQojLPI4Y&feature=emb_logo
అయితే కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 8వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఉగాది రోజున మోషన్ పోస్టర్‌తో సినిమా టైటిల్ ప్రకటిస్తామని ముందుగానే చెప్పారు. ఇక ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. రౌద్రం రణం రుధిరం టైటిల్‌తో సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. పోస్టర్లో కొమరం భీంగా నటిస్తోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజుగా నటిస్తోన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరి లుక్స్ చాలా భయంకరంగా ఉన్నారు.
వీరిద్దరు కలిసి రౌద్రం రణం చూపిస్తే ఎలా ఉంటుందో పోస్టర్ కూడా అలాగే ఉంది. ఇద్దరు హీరోలు భగభగ మండుతూ పరిగెత్తుతున్న స్టిల్స్‌తో పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక రాజమౌళి సినిమాల్లో హీరోలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో ? విలన్ అంతకు మించి భయంకరంగా ఉంటాడు ? అయితే ఈ సినిమా మోషన్ పోస్టర్ చూస్తుంటే మాత్రం హీరోలే చాలా భయంకరంగా ఉన్నారు ? ఇక విలన్ అయిన అజయ్ దేవగణ్ ఇంకెంత అరివీర భయంకరంగా ఉంటాడన్న చర్చలు కూడా మొదలయ్యాయి. ఇక మోషన్ పోస్టర్ నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది.