ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా తనకు ఎవరు అభినందన సందేశాలు పంప వద్దని రామ్ చరణ్ ఇప్పటికే తెలియచేసాడు. అయితే ఈ విషయాన్ని చిరంజీవి పట్టించుకోకుండా చరణ్ చిన్ననాటి ఫోటోలు కొన్నింటిని చిరంజీవి తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో షేర్ చేసి మెగా అభిమానులకు జోష్ ఇచ్చాడు. 


రామ్ చరణ్ చిన్నతనంలో చిరంజీవి పడుకుని ఉన్నప్పుడు అతడి దగ్గర నిలబడి నవ్వుతూ ఆడుకుంటున్న ఫోటోను చిరంజీవి షేర్ చేసి చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసాడు. అంతేకాదు చరణ్ పుట్టినరోజునాడు ప్రపంచ రంగస్థల దినోత్సవం మార్చి 27న జరుగుతుందని అయితే చరణ్ పుట్టినప్పుడు చరణ్ హీరో అవుతాడని ‘రంగస్థలం’ పేరుతో ఒక మూవీలో నటించి ఆ మూవీతో చరిత్ర సృష్టిస్తాడు అంటూ తాను భావించలేదు అంటూ చరణ్  పై చిరంజీవి ప్రశంసలు కురిపించాడు.


ఇప్పుడు చరణ్ గురించి చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో మెగా అభిమానులు జోష్ లోకి వెళ్ళి పోవడమే కాకుండా చరణ్ వద్దు అని చెపుతున్నా వినిపించు కోకుండా చరణ్ పుట్టినరోజు సంబరాలను సోషల్ మీడియా ద్వారా మెగా అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉగాదినాడు సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి స్పీడ్ చూసి టాప్ హీరోలు కూడ ఆశ్చర్య పడుతున్నారు.


ప్రతిరోజు అనేక కామెంట్స్ తన సోషల్ మీడియా పేజీలలో పెట్టడమే కాకుండా తన కామెంట్స్ కు సమాధానాలు ఇస్తున్న పలు సెలెబ్రెటీలను ఆట పట్టించే కామెంట్స్ చిరంజీవి చేస్తున్నాడు. తన సోషల్ మీడియా ఎంట్రీని స్వాగతిస్తూ పూరి జగన్నాథ్ చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ కరోనా వల్ల గృహ నిర్భందంలో ఉండటంతో గోవా కు వెళ్లి ఎంజాయ్ చేసే అవకాశాలు పోగొట్టుకున్నావా అంటూ చిరంజీవి పూరీ పై వేసిన సెటైర్లు చూసిన వారు ఇక రానున్న రోజులలో చిరంజీవి స్పీడ్ ఇంకా ఎంత పెరిగిపోతుందో అంటూ ఆశ్చర్య పడుతున్నారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: