అక్కినేని నాగార్జున కు బాలకృష్ణ కు పెద్దగా సాన్నిహిత్యం లేకపోయినా నాగార్జున హరికృష్ణ లకు మాత్రం మంచి అనుబంధం హరికృష్ణ జీవించి ఉన్నంతకాలం కొనసాగింది. హరికృష్ణ ను నాగ్ ఎప్పుడు ప్రమతో అన్నయ్య అని పిలుస్తూ ఉండేవాడు. ఆ అనుబంధంతో జూనియర్ నాగార్జునను ఇప్పటికీ బాబాయ్ అని పిలుస్తూ ఉంటాడు. 


ఇంత సాన్నిహిత్యం ఉన్న వీరిద్దరూ ఒక మల్టీ స్టారర్ లో నటించడానికి జూనియర్ అభిమానుల భయంతో ఆ ప్రపోజల్ చర్చలలోనే ఆగిపోయింది. ఆ సక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే ఒకవిషయం ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వంశీ పైడిపల్లి నాగార్జున కార్తీ లతో తీసిన ‘ఊపిరి’ మూవీ ప్రాజెక్ట్ లో ముందుగా కార్తి ప్లేస్ లో జూనియర్ ను అనుకున్నారు.  


జూనియర్ కు ‘ఊపిరి’ కథ నచ్చడంతో పాటు ఎప్పటి నుంచో నాగార్జునతో కలిసి ఒక మూవీ చేయాలి అన్న కోరిక ఉండటంతో అప్పట్లో వెంటనే జూనియర్ ఆ పాత్ర చేయడానికి ఒకే చెప్పాడట. అయితే ఆ సినిమా కథ రీత్యా ఒక ముఖ్య సన్నివేశంలో జూనియర్ నాగార్జున కాళ్ళు పట్టుకోవలసిన సీన్ ఉంటుంది. అయితే అలాంటి సీన్ తాను నటిస్తే తన అభిమానులు ఒప్పుకోరు అని జూనియర్ వంశీ పైదిపల్లితో అన్నాడట. ఆ సీన్ లేకుంటే ఆ మూవీలో ఉన్న ఫీల్ తగ్గిపోతుంది అంటూ వంశీ పైడిపల్లి జునియర్ తో చెప్పడంతో జూనియర్మూవీ నుండి తప్పుకోవడంతో అతడి స్థానంలో కార్తి వచ్చి చేరడం జరిగింది. 


అదేవిధంగా జూనియర్ కు మొదట్లో కొరటాల శివ ‘శ్రీమంతుడు’ కథ చెపితే అ కథ తారక్ కు నచ్చక పోవడంతో అప్పట్లో మహేష్ వచ్చి చేరాడట. అంతేకాదు జూనియర్ కు ఎంతో సన్నిహితుడైన సుకుమార్ ‘ఆర్యా’ కథను అతడిని ఆలోచించి రాస్తే తారక్ ఆ కథ బాగా లేదు అనడంతో ఆ కథ అల్లు అర్జున్ వద్దకు వెళ్లి ఆ మూవీ తరువాత బన్నీ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇలా జూనియర్ తన కెరియర్ లో అనేక హిట్ సినిమాలు వదులుకున్న విషయాన్ని ఈమధ్య ఒక మీడియా సంస్థ తన కథనంలో హైలెట్ చేయడంతో ప్రస్తుతం ఈ వార్తలు జూనియర్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: