ఈ మ‌ధ్య కాలంలో ఆక‌తాయిల ఆగ‌డాలు బాగా ఎక్కువ‌యిపోయాయి. అందులోనూ సైబ‌ర్ నేరాల‌కు హ‌ద్దు అదుపు లేకుండా పోతుంది. సెల‌బ్రెటీలు, హీరోయిన్లంటే చాలా చుల‌క‌న భావంతో చూస్తుంటారు. వారు ఫ్యాన్స్ కోసం కొన్ని సోష‌ల్ మీడియాల ద్వారా పెట్టే ఫొటోల‌ను కొన్ని అస‌భ్య‌క‌ర‌మైన వెబ్‌సైట్లు వాడుకుంటున్నాయి. అలా చేస్తే వారి మ‌న‌నోభావాల‌తో ఆడుకుంటున్నారు. అంతేకాక ఇలాంటి వాటిని చూసినప్పుడు వారు తీవ్ర మ‌న‌స్థాపానికి గుర‌వుతున్నారు. ఇలాంటి దారుణ‌మైన ఘ‌ట‌నే ఒక‌టి  న‌టి ఆశ్రిత వేముగంటికి జ‌రిగింది. 

 

వివ‌రాల్లోకి వెళితే... ఫోటోలు మార్ఫింగ్ చేయడం, పోర్న్ సైట్స్, అడల్ట్ వెబ్ సైట్స్, డేటింగ్ వెబ్ సైట్స్ తో పోస్ట్ చేస్తున్నారు. ఇక న‌టి ఆశ్రిత వేముగంటికి కూడా ఇలాంటి ప‌రిస్థితే ఒక‌టి ఎదుర‌యింది. బాహుబ‌లి 2 చిత్రంలో అనుష్క వ‌దిన పాత్ర‌లో న‌టించిన ఆమెకు మంచి గుర్తింపు వ‌చ్చింది. ఆ చిత్రంలో ఆమె పాత్ర నివిడి త‌క్కువే అయిన‌ప్ప‌టికి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆమె న‌టించిన త‌ర్వాత చిత్రం మ‌హి వి రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన యాత్ర చిత్రంలో వై.ఎస్‌.విజ‌య‌మ్మ‌గా న‌టించి అచ్చు గుద్దిన‌ట్లు ఆమెలానే న‌టించి మెప్పించి తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో ఆ పాత్ర చెరిపోని ముద్ర వ‌లె నిలిచిపోయింది. 

 

ఇక ఇటీవ‌లె ఆమెకు ఓ చేదు అనుభ‌వం ఎదుర‌యింది. అదేమిటంటే ఆమెఫొటోలు అడ‌ల్ట్ వెబ్‌సైట్‌లో క‌నిపించాయి. ఓ డేటింగ్ వెబ్‌సైట్ నుంచి చేదు అనుభ‌వాన్నిఎద‌ర్కొంది. కొంద‌రు వారి వెబ్‌సైట్ క్లిక్ అవ్వ‌డం కోస‌మ‌ని మ‌రికొంద‌రు అట్రాక్ష‌న్ కోసం సినీ హీరోయిన్లు సెల‌బ్రెటీల ఫొటోల‌ను వాడుతుంటారు. అలా ఈమె ఫొటోల‌ను కూడా హాట్ ఫోటోలని సెక్స్ అప్పీల్ ఉండే విధంగా అసభ్యంగా ఉపయోగిస్తున్నారు. ఇక తాజాగా ఈమె ఫొటోలు కూడా ఆ వెబ్‌సైట్ లో ఉన్నాయి.

 

దాంతో అవి చూసిన ఆమె షాక్ అయి చాలా బాధ‌ప‌డి వెంట‌నే పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఇలా త‌న ఫొటోలను ఇబ్బంది క‌లిగే విధంగా పెట్టిన‌ట్లు  స‌ద‌రు వెబ్‌సైట్ పై పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చింది. అంతేకాక ఆమె తీవ్ర మ‌న‌స్ధాపానికి కూడా గుర‌యింది. ఇక ఆ ఫొటోలు ఈమె కంట‌ప‌డ‌టానికి ప్ర‌ధాన కార‌ణం ఏమిటంటే అవి వాళ్ళు థ‌మ్‌నేల్స్ కింద పెట్ట‌డంతో వెంట‌నే ఈమె కంట‌ప‌డ్డాయి. ఇక దీన్ని బ‌ట్టి ఆలోచిస్తే సెల‌బ్రెటీల‌యినా వారికి ఫ్యామిలీలు ఉంటాయి. వారు మ‌నుషులే ఎవ్వ‌రి మ‌నోభావాలు దెబ్బ తినేలా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌ద‌ని స‌ద‌రు వెబ్‌సైట్ వారు ఆలోచించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: