స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి టాలీవుడ్ లో ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే.  తాత అల్లు రామ లింగయ్య,  మామ చిరంజీవి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని తెలుగులో స్టార్ హీరోగా అదరగొడుతున్నాడు ఈయ‌న‌. ఇక ఈ పాపులర్ యాక్టర్ లైఫ్ స్టైల్ దగ్గర నుండి చూసినవాళ్లు మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఇక నేడు ఈయ‌న 38వ బ‌ర్త్‌డేను జ‌రుపుకుంటున్నారు. అయితే చిన్నప్పుడే తన మామ చిరు నటించిన ‘విజేత’ చిత్రంలో బాలనటుడిగా మెరిసాడు. ఆ తర్వాత చిరంజీవి యాక్ట్ చేసిన ‘డాడీ’ చిత్రంతో  చిన్నరోల్ లో కనిపించి మురిపించాడు. 

 

ఆ త‌ర్వాత పూర్తి స్థాయి హీరోగా  గంగోత్రి సినిమాతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే బన్నీ.. కుటుంబంతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి సరదాగా గడుపుతుంటారు. ఇక అల్లు అర్జున్‌ది ప్రేమ‌వివాహం.  ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధంలేని అమ్మాయి స్నేహా రెడ్డి. ఇబ్రహీంపట్నంలో బీటెక్ చదివిన స్నేహారెడ్డి.. అమెరికాలో ఎమ్మెస్ చేశారు. వ్యాపారవేత్త, విద్యాసంస్థల అధినేత కేపీఎస్ రెడ్డి కుమార్తె ఈమె. అయితే స్నేహా రెడ్డి ఓ ఫ్రెండ్ పెళ్లిలో అల్లు అర్జున్ కంట పడింది. ఇంకేముంది అప్పుడే స్నేహా రెడ్డి ఫ్లాట్ అయిపోయాడు బ‌న్నీ. 

 

ఇక అక్క‌డ జ‌రిగిన ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. అయితే అల్లు అరవింద్ తొలుత వీరిద్ద‌రి పెళ్లికి అయిష్టత చూపారట. మ‌రియు స్నేహా రెడ్డి కుటుంబ స‌భ్యులు కూడా వీరి పెళ్లికి సుముక‌త చూప‌లేద‌ట‌. ఇక ఆ త‌ర్వాత కులాలకు అతీతంగా వీరిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నారు. అయితే ఈ పెళ్లి కోసం ఎక్కువగా కష్టపడింది మాత్రం అల్లు అర్జునేనని చాలా మంది అంటుంటారు. వీటి వివాహం 2011 మార్చి 6న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. 

 

వారి ప్రేమకు ప్రతిరూపంగా 2014 ఏప్రిల్ 4న అయాన్ జన్మించాడు. 2016లో కూతురు అర్హ జన్మించింది. మొత్తానికి స్నేహా కూడా బ‌న్నీకి త‌గిన జోడీనే. అందుకే ఈ జంట‌ను ద‌గ్గ‌ర‌గా చూసిన వారు ఎవ‌రైనా మీ ల‌వ్‌స్టోరీ తెలుగు టీవీ సీరియ‌ల్స్‌లా అలాగే కొన‌సాగుతుంద‌ని అంటుంటారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: