దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావుకు మొత్తం ఎనిమిది మంది మ‌గ సంతానం.. న‌లుగురు ఆడ సంతానం. మొత్తం 12 మంది. వీరిలో ఎవ‌రు ఎలా ఉన్నా దివంగ‌త మాజీ మంత్రి నంద‌మూరి హ‌రికృష్ణ .... సినీ స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ మ‌ధ్య ఎంతో అనుబంధం ఉంది. వాస్త‌వంగా ఎన్టీఆర్‌కు మొత్తం 12 మంది వార‌సులు ఉన్నా వీరిలో బాల‌య్య‌, హ‌రికృష్ణ‌నే ఎక్కువుగా ప్రేమించేవారు. వీరిద్ద‌రు రాజ‌కీయంగా త‌న వార‌స‌త్వాన్ని నిల‌బెడ‌తార‌ని ఆయ‌న అంటుండేవారు.

 

ఇక ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్పుడు చైత‌న్య ర‌థం న‌డిపిని హ‌రికృష్ణ పార్టీ కోసం నిస్వార్థంగా సేవ‌లు చేసేవారు. ఇక ఎన్టీఆర్ త‌న రాజ‌కీయ వార‌సుడిగా బాల‌కృష్ణ‌ పేరు చెప్పినా చంద్ర‌బాబు ఒత్తిడి తెచ్చి మ‌రీ ఆ మాట‌ను ఉప‌సంహ‌రించుకునేలా చేశారు. ఎన్టీఆర్‌ను చంద్ర‌బాబు ప‌ద‌వి నుంచి దింపేశాక హ‌రికృష్ణ ర‌వాణా శాఖా మంత్రిగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత 1999లో చంద్ర‌బాబు హ‌రికృష్ణను ప‌క్క‌న పెట్ట‌డంతో చివ‌ర‌కు హ‌రికృష్ణ అన్న తెలుగుదేశం స్థాపించి గుడివాడ నుంచి ఆయ‌న ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయ‌న ఓడిపోవ‌డంతో పాటు ఓవ‌రాల్‌గా స్టేట్‌లో కూడా పార్టీ ఓడిపోయింది.

 

ఆ త‌ర్వాత హ‌రికృష్ణ - బాల‌కృష్ణ మ‌ళ్లీ ద‌గ్గ‌ర అయ్యారు. అయితే విభ‌జించి పాలించే చంద్ర‌బాబు చివ‌ర‌కు బాల‌కృష్ణ కుమార్తెను త‌న కుమారుడికి చేసుకుని మిగిలిన వార‌సుల‌ను వ్యూహాత్మ‌కంగా ప‌క్క‌న పెట్టారు. ఈ పెళ్లి జ‌రిగేంత వ‌ర‌కు కూడా హ‌రికృష్ణ - బాల‌య్య మ‌ధ్య మంచి సంబంధాలే ఉండేవి. ఆ త‌ర్వాత హ‌రికృష్ణ కుమారుడు ఎన్టీఆర్ సినిమాల్లో స్టార్ హీరో అవ్వ‌డంతో మ‌ళ్లీ అది సినిమా, రాజ‌కీయ రంగాల్లో కంట‌గింపుగా మారింది. చివ‌ర‌కు ఎన్టీఆర్ పెళ్లి తానే చేశానని బిల్డ‌ప్ ఇచ్చుకున్నారు.

 

ఎన్టీఆర్‌ను ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి వాడుకున్నారు. చివ‌ర‌కు హ‌రికృష్ణ మ‌ర‌ణం త‌ర్వాత కూడా ఆ సానుభూతిని వాడుకోవాల‌ని ఆయ‌న కుమార్తె సుహాసినిని కూక‌ట్‌ప‌ల్లిలో పోటీ చేయించి ఓడేలా చేశారు. ఆ త‌ర్వాత బాల‌య్య - ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్‌రామ్ మ‌ళ్లీ ద‌గ్గ‌రైనా ఎన్నిక‌ల ప్ర‌చారానికి మాత్రం ఈ అన్న‌ద‌మ్ములు దూరంగానే ఉన్నారు. ఏదేమైనా బాల‌య్య - హ‌రికృష్ణ మ‌ధ్య ముందు నుంచి మంచి సంబంధాలు ఉండేవి. కానీ చంద్ర‌బాబు విజ‌భ‌న రాజ‌కీయంలోనే వీరి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: