ఎప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జపం చేసే నటుడు, నిర్మాత బండ్ల గణేష్ లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ పిక్ ఒకటి షేర్ చేస్తూ హాలీవుడ్ స్టార్ అంటూ ట్వీట్ చేయడం మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరిని షాక్ అయ్యేలా చేసింది. మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో బండ్ల గణేష్ బ్లేడ్ బాబ్జి రోల్ లో నటించాడు. ట్రైన్ ఎపిసోడ్ లో మహేష్, బండ్ల గణేష్కామెడీ అలరిస్తుంది. ఆ సినిమా టైంలోనే ఇక తను సినిమాలనే చేస్తా అని చెప్పుకొచ్చాడు. 

 

రాజకీయాల్లోకి వెళ్లి జోకర్ గా మారిన బండ్ల గణేష్ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోనే కొనసాగేలా ప్లాన్ చేసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నా దేవుడు.. నా పిల్లలకు దేవుడు ఎలా ఉంటాడు అన్తే పవన్ ఫోటో చూపిస్తా అని చెప్పిన బండ్ల గణేష్ సడెన్ గా మహేష్ ఫోటోని  షేర్ చేసి హాలీవుడ్ స్టార్ అని పెట్టడానికి గల కారణాలు ఏంటో అర్ధం కావట్లేదు. మహేష్ బాబు నిజంగానే హాలీవుడ్ స్టార్ లా ఉంటాడు. ఆ విషయం బండ్లకు ఇప్పుడు తెలిసిందా.. అంటే మాహేష్ తో సినిమా చేశాక కానీ మహేష్ టాలెంట్ ఏంటన్నది అర్థమైందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

ఏది ఏమైనా మహేష్ హాలీవుడ్ స్టార్ అని బండ్ల గణేష్ చేసిన ట్వీట్ కు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. తెలుగులోనే సినిమాలు చేస్తూ నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న అతి తక్కువ హీరోల్లో మహేష్ ఒకరు. బాలీవుడ్ సినిమాలు చేయరా అటు వైపు వెళ్ళరా అన్న ప్రశ్నకు మహేష్ ఎప్పుడు ఇక్కడ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అక్కడకు వెళ్లాల్సిన అవసరం ఇప్పుడు లేదంటూ సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తారు. మహేష్ హిందీ సినిమా చేస్తే చూడాలని చాలామంది బాలీవుడ్ ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: