నందమూరి నట వారసుడిగా బాలకృష్ణ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. పవర్ ఫుల్  హీరోయిజానికి పెట్టింది పేరుగా మాస్ ప్రేక్షకులందరికీ దేవుడిగా బాలయ్య తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. బాలయ్య సినిమా వస్తుందంటే చాలు మాస్ ప్రేక్షకులు అందరికీ పండగే అని చెప్పాలి. అదిరిపోయే హీరోయిజం తో.. పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ లతో...ఔరా  అనిపించే ఫైట్ సీన్ లతో బాలయ్య తన సినిమాల్లో ఇరగదీస్తూ  ఉంటాడు. అయితే బాలకృష్ణ ఎంతమంది డైరెక్టర్లతో సినిమాలు తీసినప్పటికీ బాలయ్య బోయపాటి కాంబినేషన్ మాత్రం సినిమా ప్రేక్షకులందరికీ ఎప్పుడు స్పెషల్ అన్న విషయం తెలిసిందే. బాలయ్య ను ప్రేక్షకులు ఎలా చూడాలి అనుకుంటున్నారో  అలా చూపిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు  బోయపాటి. 

 

 

 ఇక వీరిద్దరి కాంబినేషన్లో సింహ  లెజెండ్ లాంటి సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ప్రస్తుతం బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి బోయపాటి తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రకటన విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమా కథ గురించి పాత్రల గురించి... హీరోయిన్ గురించి విలన్ గురించి ఇలా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త కూడా వైరల్ గా మారిపోయింది. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ పోషించ పోతున్నాడు అనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ లో వినిపిస్తుంది. 

 

 

 రెండు పాత్రల్లో భాగంగా ఒక పాత్రలో బాలయ్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర బలంగా రూపొందిస్తున్నారు దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. అయితే బాలయ్య లాంటి పవర్ ఫుల్ హీరో ని ఢీ కొట్టడానికి వేరే  పవర్ఫుల్ విలన్ని  పెట్టే బదులు అక్కడ కూడా మరో పవర్ఫుల్ బాలయ్య పాత్రను పెడితే బాగుంటుంది అనే దర్శకుడు భావిస్తున్నాడట. ఇక దర్శకుడు బోయపాటి ఆలోచనకు నందమూరి బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ సినిమాలో బాలయ్య విలన్ పాత్రలో కనిపించడం లేదని కేవలం మొదటి కొన్ని నిమిషాలు మాత్రమే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అని కూడా టాక్  వినిపిస్తోంది.మరి  దీనిపై స్పష్టత రావాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: