పై ఫోటోలో కనిపిస్తున్న నలుగురు సుందరీమణులలో... సీనియర్ నటి సిమ్రాన్, మొన్నామధ్య వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించిన ఐశ్వర్య రాజేష్, చంద్రముఖి చిత్రంలో అందరినీ భయపెట్టిన హీరో సూర్య భార్య జ్యోతిక, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రేవతి ఉన్నారు. JFW అనే మహిళల కోసమే ఏర్పడిన ఓ అతిపెద్ద డిజిటల్ సంఘం... 2019 లో విడుదలైన తమిళ సినిమాలలో అద్భుతంగా నటించి ప్రేక్షకాదరణ పొందిన నటీమణుల నటనా ప్రదర్శనను గుర్తించి వారికి అవార్డులను అందజేసింది.


అయితే ఈ అవార్డు కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలు విజయ్ టీవీ ఛానల్ లో రేపు అనగా ఏప్రిల్ 19వ తేదీన మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రసారం అవుతాయి. ఈ అవార్డ్ ఫంక్షన్ కు టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, నితిన్ సరసన లై చిత్రంలో నటించిన మేఘా ఆకాశ్, యాక్టర్ విక్రమ్ ప్రభు, నటీమణి మీనా, దర్శకుడు చరణ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.


ఇకపోతే JFW మూవీ అవార్డ్స్ 2020 లో ఉత్తమనటి అవార్డును ఐశ్వర్య రాజేష్ అందుకున్నారు. ఈమె శివ కార్తికేయన్ హీరోగా నటించిన 'నమ్మా వీట్టు పిళ్ళై' చిత్రంలో హీరోయిన్ గా నటించి తన రక్తం లోనే నటన ఉందని చెప్పకనే చెప్పేసింది. ఈమెకు ఉత్తమ నటి అవార్డు రావడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు. లేడీ ఓరియంటెడ్ సినిమా అయిన రాట్చసి లో జ్యోతిక నటన ఒక రేంజ్ లో ఉందని చెప్పుకోవచ్చు. అందుకే ఆమెకు మహిళా ప్రాధాన్యత చిత్రాలలో ఉత్తమనటి గా గుర్తించి అవార్డు ఇచ్చారు. వాస్తవానికి రాట్చసి సినిమా ఉత్తమ మహిళా ప్రాధాన్యత/ లేడీ ఓరియంటెడ్ సినిమాగా ఒక అవార్డును గెలుచుకుంది.


కుర్ర హీరోయిన్ మేఘా ఆకాష్ కూడా 'ఎన్నీ నోకి పావుమ్ తోట్టాకు' లో నటించి ఉత్తమ డెబ్యూటంటే గా అవార్డును అందుకుంది. జాక్పాట్ సినిమాలో కమెడియన్ గా నటించిన రేవతి తన నటనకు గాను ఉత్తమ మహిళా కమెడియన్ అవార్డు ని సొంతం చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నటీమణులు తమ నటన టాలెంట్ కు ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: