టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో  సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరో గా దూసుకుపోతున్నారు  మహేష్ బాబు. వరుస విజయాలను అందుకుంటూ  బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నారు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్ బాబు. అంతేకాకుండా ఎప్పుడు అభిమానులను ఇన్స్పైర్ అయ్యేలా  ఏదో ఒక మెసేజ్ ఇస్తూనే ఉంటాడు మహేష్ బాబు. అటు సినిమాల్లోనే కాదు అది సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటాడు. ఇక మహేష్ బాబు ఏదైనా ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అంటే అది క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది. 

 

 మామూలుగానే మహేష్ బాబు చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు. కానీ మాట్లాడిన అందరికీ ఇన్స్పిరేషన్గా నిలిచేలా  మోటివేషన్ అయ్యేలా మాట్లాడుతూ ఉంటారు. అయితే మహేష్ బాబు మొన్నటికి మొన్న ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అప్పుడు వరకు క్లాస్ లుక్ తో అదరగొట్టిన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా లో సరికొత్తగా మాస్ లుక్ తో అదరగొట్టే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కాగా ప్రస్తుతం గీతగోవిందం ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు మహేష్ బాబు.

 

 ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా ప్రస్తుతం అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తుంది ఈ పోస్ట్. ఈ ఫోటోలో  మహేష్ బాబు దీనంగా ఆలోచిస్తున్నట్లుగా ఉంది. అంతేకాకుండా ఈ ఫోటోకి ఒక ట్యాగ్  కూడా చేశాడు మహేష్ బాబు. మీ అందరి భవిష్యత్తు చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది... ఎక్కువగా మీ మీద  ఆధారపడి ఉంటుంది. మీరు ఎలా ఉన్నారు అనే దానిపైన మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. 100 సమస్యలు వచ్చినా విక్టరీ హ్యాండ్ స్మైలింగ్ పేస్ తో నవ్వుతున్న  కళ్ళతో  ముందుకు వెళ్ళండి అంటూ మహేష్ బాబు  ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తోంది. మంచి మోటివేషన్  ఇచ్చారు సార్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: