బాలీవుడ్ కా రాణి కంగనా రనౌత్ ప్రజల సమస్యల గురించి మాట్లాడేందుకు ఎప్పుడూ ముందుంటుంది. భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇటీవల ఆమె ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని కొనియాడి వార్తల్లోకి ఎక్కింది. మళ్ళీ ఇప్పుడు పేద సినీ కార్మికుల కోసం 10 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చి వార్తాపత్రికల్లోకి ఎక్కింది. ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా సంస్థకు రూ. 5 లక్షలు ఇవ్వడంతోపాటు, జయలలిత బయోపిక్ తైలేవి చిత్రంలో పనిచేయనున్న రోజువారి సినీ కార్మికులకు కూడా ఐదు లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది.


తైలేవి సినిమా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, లెజెండరీ యాక్టర్ జయలలిత జీవిత చరిత్ర నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇందులో కంగనా రనౌత్ జయలలిత పాత్ర పోషిస్తుండగా... అరవిందస్వామి ప్రియమణి, జిష్షు సేన్ గుప్తా తదితరులు కీలకమైన పాత్రలలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదల అవుతున్న ఈ సినిమాకి విజయ్ దర్శకత్వం వహిస్తుండగా... ఈ బయోపిక్ కి కేవలం ఒకే ఒక్క టైటిల్ "తైలేవి" మాత్రమే ఖరారు చేశారు. కంగనా రనౌత్ కి చివరిగా క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన పంగా చిత్రంలో నటించి అందర్నీ ఎంతో మెప్పించింది.


కేవలం ఈ ఒక్క సినిమా ప్రాజెక్టు కోసం ఆరు నెలల పాటు కఠోరమైన వ్యాయామ సాధనాలు చేసింది. భరతనాట్యం కూడా నేర్చుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. తమిళ భాష కూడా నేర్చుకున్న ఈమె జయలలిత లాగా కనిపించేందుకు ప్రొస్తెటిక్ మేకప్ సెషన్స్ లలో చాలా గంటల పాటు సమయాన్ని గడిపి తనకు ఉన్న డెడికేషన్ ని చాటి చెప్పింది. గత ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన అనగా జయలలిత 71వ జయంతి రోజు తైలేవి చిత్రం యొక్క మొదటి లుక్ విడుదలయింది. ఏ సినిమా తెలుగు, తమిళ హిందీ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: