లాక్ డౌన్ ఉన్నా.. అందరి దృష్టి ట్రిపుల్ ఆర్ పైనే. లాక్ డౌన్ సినిమాపై చాలా అనుమానాలు తీసుకొచ్చింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టీజర్ వస్తుందా.. రాదా.. 2021 జనవరి 8న సినిమా రిలీజ్ అవుతుందా.. అజయ్ దేవగణ్ పాత్ర ఏమిటి. కరోనా ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీపై ఎలా ఉంటోంది. ఇలా చాలా ప్రశ్నలకు ఎన్టీఆర్ సమాధానాలు చెప్పేశాడు. 

 

కరోనా హాలిడేస్ ను రాజమౌళి చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. వరుస సినిమాలతో 15ఏళ్ల నుంచి రీడింగ్ హ్యాబిట్ కు దూరమయ్యాడు. ప్రస్తుతం పెద్ద దర్శకులు.. వాళ్ల మేకింగ్ గురించి పుస్తకాన్ని చదువుతున్నాడు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనా టైమ్ ను ఎలా గడుపుతుందో తెలిపారు. ట్రిపుల్ ఆర్ షూటింగ్ 50శాతం మాత్రమే పూర్తయిందని వార్తలు వస్తున్నాయి. షూటింగ్ ఎంతవరకు పూర్తయిందని అడిగిన ప్రశ్నకు.. ట్రిపుల్ ఆర్ ఇంకా 20శాతం ఉందన్నారు. జనవరి 8న రిలీజ్ ఉంటుంద అనేది కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందన్నారు. 

 

ఎన్టీఆర్, రామ్ చరణ్ ను కలపాలన్న ఆలోచన రాజమౌళికి ఎప్పటి నుంచో ఉంది. బాహుబలి కంటే ముందే పుట్టిన ఆలోచన అది. ఈ ఇద్దరినీ దృష్టిలో పెట్టుకొని రెండు, మూడు కథలు అనుకుంటే.. కొమరం భీం.. అల్లూరి సీతారామరాజు ఫిక్షన్ స్టోరీతో ఎగ్జయిట్ మెంట్ గా ఫీలయ్యాడు జక్కన్న. 

 

ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి మహేశ్ ను డైరెక్ట్ చేయనున్నాడు. ఇంతవరకు స్టోరీ లైన్ ఏదీ సెట్ కాలేదనీ.. ఈ హాలిడేస్ లో తండ్రితో కలిసి చర్చలు జరుపుతున్నానని తెలిపారు రాజమౌళి. 

 

ట్రిపుల్ ఆర్ లో అజయ్ దేవగణ్...  కొమరం భీమ్.. అల్లూరిగా నటిస్తున్న ఎన్టీఆర్.. రామ్ చరణ్ కు గురువుగా అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. సినిమాలో ఆయన పోషిస్తున్న పాత్రను రాజమౌళి రివీల్ చేయలేకపోయినా.. ఆ క్యారెక్టర్ కోసం ఆయన్ని మాత్రమే ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలిపారు. 

 

రాజమౌళి ప్రతీ సిినిమాకు ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారు. తండ్రీ కొడుకుల మధ్య డామినేషన్ ఎవరిదని అడిగితే.. స్టోరీ స్ట్రక్చర్ లో తండ్రి మాటను గౌరవిస్తానని... సీన్స్ విషయంలో తన ఇష్టప్రకారమే ఉంటుందన్నారు రాజమౌళి. 

 

కరోనా ప్రభావం సినిమా ఇండస్ట్రీపై ఉంటుందనీ.. బడ్జెట్, రెమ్యునరేషన్ విషయంలో మార్పులు తప్పవన్నారు దర్శకుడు. నటీనటుల రెమ్యునరేషన్ తగ్గుతాయని.. 10రూపాయలతో 100రూపాయల ఔట్ పుట్ తీసుకురావాల్సిన బాధ్యత దర్శకులపై ఉందన్నారు జక్కన్న. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: