కరోనా వైరస్ విజంభణ ప్రభావం అన్ని రంగాలపైనా తీవ్రంగానే ఉంది. సినిమా రంగం అందుకు అతీతం ఏమీ కాదు. ప్రస్తుతం కొత్త సినిమాలు ఏమీ షూటింగులు జరుపుకోవడం లేదు. దీనికి తోడు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు కూడా లాక్ డౌన్ కారణంగా విడుదలకు నోచుకోవడం లేదు.

 

 

చిన్నా చితకా సినిమాల సంగతి ఎలా ఉన్నా.. సూపర్ స్టార్లు నటించిన సినిమాలు విడుదల ఆగిపోవడంతో ఆ నిర్మాతలు కుదేలవుతున్నారు. బడా హీరోల సినిమాల బడ్జెట్ పదుల కోట్లలోనే ఉంటుంది. విడుదల వాయిదా పడితే వడ్డీలు కట్టలేక నిర్మాతలు భారీ నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఇందుకు వేరే మార్గం కూడా ఏమీ లేదు. అయితే లాక్ డౌన్ వేళ అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ వేదికలపై సినిమాలు రిలీజ్ చేస్తే ఎలా ఉంటుదన్న ఆలోచన కొన్ని రోజులుగా నిర్మాతల మదిలో మెదులుతోంది.

 

 

ఇలా నష్టపోవడం కంటే .. ఓటీటీల్లో రిలీజ్ చేసుకుని.. నష్టాలబారి నుంచి తప్పించుకోవచ్చన్నది వారి ఆలోచన. అందులోనూ ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు కదా. కానీ ఇందుకు కొందరు స్టార్లు సుముఖంగా లేరు. కానీ.. తాజాగా దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన మాస్టర్ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట.

 

 

దీనికి దళపతి విజయ్ కూడా సుముఖంగానే ఉన్నాడట. ఇదే నిజంగా జరిగితే..ఇక సినిమాలు ఓటీటీల్లో విడుదల కావడం మొదలయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. ఇప్పటి వరకూ పిల్లి మెడలో ఎవరు గంట కడతారా అన్నట్టుగా ఉన్న పరిస్థితి విజయ్ తో ఒకదారికొస్తుందేమో చూడాలి. నిజంగా ఇది ఓ ప్రయోగమే అవుతుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: