టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2006లో వచ్చిన అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ మూవీ పోకిరి. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ఇందిరా ప్రొడక్షన్స్, వైష్ణో అకాడమీ బ్యానర్ లు కలిసి సంయుక్తంగా నిర్మించడం జరిగింది. పూరి జగన్నాథ్, మహేష్ సోదరి మంజుల నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. ఇక అప్పట్లో మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా అతి పెద్ద ఇండస్ట్రీ హిట్టు అందుకోవడంతో పాటు ఎన్నో సంచలన రికార్డులను కూడా నమోదు చేసింది. 72 ఏళ్ల సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అతి పెద్ద విజయాన్ని అప్పట్లో అందుకున్న ఈ సినిమా, చాలా ఏరియాల్లో దిగ్విజయంగా ప్రదర్శింపబడుతూ తిరుగులేని రికార్డు నెలకొల్పడం జరిగింది. 

IHG

ఇక ఇప్పటికీ కూడా చాలా ఏరియాల్లో పోకిరి నెలకొల్పిన రికార్డులు అలానే పదిలంగా ఉన్నాయి అంటే ఈ సినిమా యొక్క స్టామినా ఎటువంటిదో తెలుసుకోవచ్చు. ఇక ఈ సినిమాకు అప్పట్లో వచ్చిన కలెక్షన్స్ ,రికార్డ్స్ చూసి వామ్మో అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ నోరెళ్లబెట్టడం జరిగింది. ముఖ్యంగా చూసిన వారే పదేపదే ఈ సినిమా చూడటం, అలానే యువత, మాస్ ప్రేక్షకులు అయితే చాలామంది పదుల సంఖ్యలో ఈ సినిమాని విపరీతంగా చూసి ఎంజాయ్ చేసినట్లు టాక్. ఇక సినిమాలో పండు పాత్రలో నటించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ పాత్రలో నటించారు అని అనడం కంటే జీవించారని చెప్పవచ్చు. 

IHG

పూరి జగన్నాథ్ పవర్ ఫుల్ డైలాగ్స్, మహేష్ మార్క్ పెర్ఫార్మన్స్, అలానే ఆయన డైలాగ్ డెలివరీ, అదరగొట్టే సాంగ్స్, వండర్ఫుల్ విజువల్స్, ట్రెమెండస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, హీరోయిన్ ఇలియానా అందాలు వెరసి ఈ సినిమాని అంత పెద్ద హిట్ చేశాయి. ఇక నేటితో ఈ సినిమా సక్సెస్ఫుల్ గా 14 ఏళ్ళు కంప్లీట్ చేసుకోవడంతో సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్, దీనిని పెద్ద ట్రెండ్ గా క్రియేట్ చేసి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: