తెలుగు చిత్ర పరిశ్రమలో సోగ్గాడు ఎవరంటే టక్కున గుర్తొచ్చేది శోభన్ బాబు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ సోగ్గాడుగా  శోభన్ బాబు ఎప్పుడూ చెరగని ముద్ర వేసుకున్నారు. గొప్ప అందగాడైన శోభన్ బాబు  ఏకంగా హీరోయిన్ల మనుసులు  సైతం కిల్లగొట్టాడు . ఇక శోభన్ బాబు ఎప్పుడు లవ్ స్టోరీలలో నటించారు అన్న విషయం తెలిసిందే. ఎక్కువగా ప్రేమ ప్రేమకథ లో నటిస్తూ ప్రేక్షకులలో  ఎంతగానో క్రేజ్ సంపాదించాడు శోభన్ బాబు. తెలుగు చిత్ర పరిశ్రమలో శోభన్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమాలు ఎన్నో. ఈ సినిమాలో శోభన్ బాబు సరసన చాలా మంది హీరోయిన్లు నటించారు. అయితే ఎంత మంది హీరోయిన్లు శోభన్ బాబు సరసన నటించిన ఓ  హీరోయిన్ మాత్రం శోభన్ బాబు అసలు సిసలైన జోడి అని నిరూపించుకున్నారు. 

 

 

 ఒకప్పటి ఆ హీరోయిన్ ఎవరో కాదు శారద. అప్పట్లో హీరోయిన్ గా ఉన్న శారదా కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా దశాబ్దకాలం పాటు కొనసాగింది శారద. అయితే  శారద శోభన్ బాబు జోడి ప్రేక్షకులకు ఎప్పుడు ఫేవరేట్ జోడి గా ఉంటుంది అనే విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉండే అనుబంధం ఆప్యాయతలు రియల్ లైఫ్ లో ఉన్నట్లు  ప్రేక్షకులు ఫీలయ్యేవారు. అందుకే ఇద్దరూ నిజజీవితంలో కూడా ఒకటి అయితే బాగుండు అని చాలామంది ప్రేక్షకులు అప్పట్లో కోరుకున్నారు. 

 

 

 కానీ అది కుదరలేదు కానీ చాలా సినిమాల్లోనే ఇద్దరు జోడిగా నటించి ప్రేక్షకులను అలరించారు. ఎన్నో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాల్లో కూడా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా బాగా దగ్గరయ్యారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు చాలానే ఆణిముత్యాల్లాంటి సినిమాలు ఉన్నాయి. మానవుడు దానవుడు... ఏవండీ ఆవిడ వచ్చింది, కాలం మారింది, బలిపీఠం, కార్తీకదీపం, సంసారం ఓ చదరంగం ఇవే కాకుండా ఇంకా మరెన్నో సినిమాల్లో  ఇద్దరు జోడిగా నటించి టాలీవుడ్ లో ఒకప్పుడు ప్రేక్షకులకు ఎంతగానో అలరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: