ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా తెలుగులో స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రాశి ఖన్నా కెరియర్ లో మొదటిసారి బోల్డ్ సీన్స్ లో నటించింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో ఆమె విజయ్ దేవరకొండలో బెడ్ సీన్స్ లో నటించింది. ఆ సీన్స్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించిందో కానీ ఇప్పుడు అవి చూస్తుంటే మాత్రం అలా చేసి తప్పు చేశా అనే ఫీలింగ్ లో ఉంది అమ్మడు. ఇక బోల్డ్ సీన్స్ లో నటించడం అదే తన ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ అంటుంది రాశి ఖన్నా. 

 

సినిమా ప్రాధాన్యతను బట్టి బోల్డ్ సీన్స్ లో నటించడం తప్పేం కాదు కానీ వరల్డ్ ఫేమస్ లవర్ లో ఇద్దరు పెళ్లి కానీ వారు డేటింగ్ లో ఉంటారు. అలా వాళ్ళద్దరు బెడ్ షేర్ చేసుకుంటారు. ఆ సీన్స్ లో ఇంతకుముందు ఎన్నడూ నటించని రాశి ఖన్నా విజయ్ దేవరకొండతో మాత్రం రెచ్చిపోయి చేసింది. ఆ దెబ్బతో అమ్మడికి బాగా తెలిసొచ్చినట్టు ఉంది. అందుకే ఇక మీదట అలాంటి సీన్స్ చేసేది లేదని తెగేసి చెబుతుంది. కేవలం బోల్డ్ సీన్స్ వల్లే సినిమాలు ఆడవు.. అయితే హీరోయిన్స్ గ్లామర్ షో చేయడం తప్పు లేదు కానీ శృతి మించి రెచ్చిపోతేనే అసలు మోసం వస్తుంది. 

 

వరల్డ్ ఫేమస్ లవర్ హిట్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఆ సినిమా ప్లాప్ అవడం.. రాశి ఖన్నా బెడ్ సీన్స్ గురించి హైలెట్ చేసి మాట్లాడటం ఎక్కడో అమ్మడిని డిస్ట్రబ్ చేశాయి. అందుకే ఇక మీదట అలంటి సీన్స్ ఉన్న ఎలాంటి సినిమా అయినా చేయనని చెప్పేస్తా అంటుంది రాశి ఖన్నా.. ప్రస్తుతం అమ్మడి చేతిలో రెండు తెలుగు ఆఫర్లు ఉన్నట్టు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: