పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో చేసింది పాతిక సినిమాలే కానీ 100కు పైగా సినిమాలు చేసిన సీనియర్ హీరోలకు సమానమైన క్రేజ్ సంపాదించాడు. సౌత్ లో హ్యుజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో పవర్ స్టార్ ఒకటి రెండు స్థానంలో తప్పక ఉంటాడు. అయితే ఎలాంటి హీరోకైనా అప్ అండ్ డౌన్ కామన్. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో కెరియర్ ప్రారంభించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుస్వాగతం సినిమా నుండి ఖుషి వరకు సినిమా తీస్తే సూపర్ హిట్ అనేలా క్రేజ్ ఏర్పడింది. 2001లో వచ్చిన ఖుషి సినిమా అప్పటివరకు పవర్ స్టార్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 

 

సినిమా తర్వాత పదేళ్ల దాకా హిట్టు కోసం ఎదురుచూడాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్. త్రివిక్రమ్ డైరక్షన్ లో 2008లో వచ్చిన జల్సా సినిమా పర్వాలేదు అనిపించుకున్నా 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా మళ్ళీ పవర్ స్టార్ ను నిలబెట్టింది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ దబాంగ్ కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాతో పవర్ స్టార్ తన పవర్ ఏంటో చూపించారు. పవన్ సినిమా హిట్టయితే రికార్డులే.. అప్పట్లో కూడా గబ్బర్ సింగ్ రికార్డ్ కలక్షన్స్ చేసింది. 

 

పవన్ కళ్యాణ్ పదేళ్లుగా హిట్టు కొట్టకపోయినా సరే ఆయన ఫ్యాన్స్ ఆయన వెంటే ఉన్నారు. ఇప్పుడు ఒక స్టార్ కు వరుసగా రెండు ప్లాపులు పడగానే పని అయిపోయిందని అంటున్నారు. మళ్ళీ హిట్టు కొట్టే వరకు కెరియర్ కష్టంగానే ఉంటుంది. అయితే స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న స్టార్స్ కు ఐదారు ప్లాపులు పడినా ఏమి అవ్వదు అయితే ఫ్యాన్స్ మాత్రం కొద్దిగా నిరాశాపడే అవకాశం ఉంటుంది. కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం పదేళ్లయినా సరే మళ్ళీ పవర్ స్టార్ పవర్ ఫుల్ హిట్టు కొడతాడని నమ్మకంతో ఎదురుచూశారు. గబ్బర్ సింగ్ హిట్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: