ప్రస్తుతం కరోనా  వైరస్ దేశాన్ని మొత్తం కబళిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా  వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్  కొనసాగుతుండగా సినిమా షూటింగ్ లన్ని  పూర్తిగా ఆగిపోయాయి  ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులందరూ లాక్ డౌన్ సమయంలో ఇంట్లో కూర్చొని హాయిగా రెస్ట్ తీసుకో కుండా... సినీ ప్రేక్షకులందరికీ కరోనా  వైరస్ పై అవగాహన కల్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు కరోనా  వైరస్ యుద్ధంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పలు వివరాలను తెలుపుతూ జాగ్రత్తగా ఉండాలని సూచనలు సలహాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అన్నది ఎంతో మంది సినీ సెలబ్రిటీలు తెలిపారు. 

 


 ఇక తాజాగా టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా ప్రస్తుతం కరోనా  వైరస్ నుంచి తప్పించుకోవడానికి తీసుకోవాల్సిన టిప్స్ గురించి తన అభిమానులకు సినీ ప్రేక్షకులకు ప్రజలందరికీ తెలియజేసింది. హలో ఆప్ ఎక్స్ క్లూజివ్  ద్వారా పూజా హెగ్డే కరోనా  వైరస్ గురుంచి  చెబుతూ ఉన్న  వీడియో  ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరల్ ఐపోతోంది. ఇంతకీ పూజా హెగ్డే కి తెలుగు రాదు కదా టిప్స్ ఇంగ్లీషులో చెప్పిందా అంటారా... అలా అనుకుంటే పొరపాటే అచ్చ తెలుగులో ముద్దు ముద్దు గా మాట్లాడుతూ కరోనా  వైరస్ గురించి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యూట్ క్యూట్ మాటలతో తెలియజేసింది పూజా హెగ్డే. 

 


 హలో నేను మీ పూజ హెగ్డే అంటూ మొదలుపెట్టి కరోనా వైరస్ దరి  చేరకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు... దేశం మొత్తం కరోనా  వైరస్ తో పోరాడుతున్న విషయాన్ని తన వీడియోలో తెలియజేసింది పూజా హెగ్డే. అందరూ శానిటైసర్లు  వాడాలని సామాజిక దూరాన్ని పాటించాలి అని.. కరోనా  వైరస్ మహమ్మారిని తరిమికొట్టాలని వీడియోలో  అభిమానులు ప్రేక్షకులు అందరికీ సూచించింది పూజా హెగ్డే. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో హలో యాప్  ఎక్స్ క్లూజివ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: