తెలుగు చిత్ర పరిశ్రమలో  తమన్నా కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ దాదాపు తెలుగులో అందరు హీరోల సరసన నటించింది అని చెప్పాలి. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో కూడా నటించి ఎంతో క్రేజ్ సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ అమ్మడు  తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై దశాబ్ద కాలం గడిచి పోతుంది అయిన  ఈ అమ్మడి క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఓ వైపు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు తన అందాల ఆరబోతతో ప్రేక్షకులకు చెమటలు పట్టించింది ఈ ముద్దుగుమ్మ. 

 

 

 ఇక బాహుబలిలో అయితే తన అందాల ఆరబోతతో అందరిని ఊహల ప్రపంచంలో కి తీసుకెళ్ళింది ఈ మిల్కీ బ్యూటీ. ఇక నటనలో కూడా ఈ అమ్మడు ఎక్కడ తక్కువ కాదు అన్న విషయం తెలుసిందే. . ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటిస్తూ పాత్రకు ప్రాణం పోస్తుంది  ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ఎక్కడా కనిపించడం లేదు. ఇక తాజాగా సిటీ మార్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీటీమార్ సినిమాలో తమన్నా ఓ ప్రధాన పాత్రలో నటిస్తోంది. 

 

 

 ఇక తాజాగా సిటీ మార్ సినిమాలో తమన్నా పాత్ర కు సంబంధించి ఓ మోషన్ పోస్టర్  విడుదల చేసింది చిత్ర బృందం . కబడ్డీ కోచ్ జ్వాలా  రెడ్డి ఇదిగో చూడండి అంటూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఇక ఈ పోస్టర్ లో ఎంతో పవర్ ఫుల్ లేడీ గా కనిపిస్తుంది తమన్నా. ఇప్పటివరకు కనిపించని డిఫరెంట్ లుక్ తో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది తమన్నా. అయితే ఈ సినిమా తమన్నా కెరీర్ ను మళ్లీ ట్రాక్ లొకి తెస్తుంది అని మంచి నమ్మకంతో ఉంది ఈ ముద్దుగుమ్మ. సంపత్ నంది కూడా మంచి సినిమాలను తెరకెక్కిస్తు  ఉంటారు అనే విషయం తెలిసిందే . కాగా  కబడ్డీ కోచ్ గా తమన్నా ఎలా ప్రేక్షకులను అలరించబోతోంది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: