తేట తేట తెలుగు పదాలతో.. తెల్లవారి వెలుగులాంటి పాటల్ని వేలాదిగా రాసిన మనసు కవి.. మన..సుకవి.. ఆయన. నిన్ను నిన్నుగ ప్రేమించుటకు.. నీ కోసమే కన్నీరు నించుటకు.. నేనున్నానని నిండుగ పలికే.. అంటూ తన తరం కవుల పైనే కాకుండా తన తర్వాత తరం కవుల మీద కూడా బలమైన ముద్ర వేసిన కవి.. రచయిత.. దర్శకుడు.. దార్శినికుడు.. ఆచార్య ఆత్రేయ. ఈ రోజు ఆత్రేయ జయంతి. ఈ సందర్భంగా మనసు కవి గీతాంజలి విశేషాలు మీ కోసం. అప్పట్లో ఆత్రేయ పాటలంటే అదొక సూపర్ హిట్ అనే డిసైడ్ అయ్యారు.  మాలట నుంచి.. నేచర్ నుంచి ఆయన స్ఫూర్తి పొంది ఎంతో సరళమైన పదాలతో పాటలు రాసేవారు. 

 

ఆనాటి అపురూప చిత్రాల్లో ఆత్రేయ మరో స్పెషాలిటీ సాధించారు. ఈ డికేడ్ లో ఆయన హార్ట్ స్పెషలిస్టు అయ్యారు. తేనెమనసులు, కన్నెమనసులు, కలిసిన మనసులు , మూగ మనసులు ఇలా మనసు తో అంతమయ్యే టైటిల్ ఉన్న సినిమాటన్నింటికీ ఆయనే కలంతోనే మనసు పాటలను పలికించారు. అలా మనసు కవిగా మారారు. ఇప్పటికీ తెలుగు లో మనసు మీద వచ్చిన మనసైన పాటలు ఏంటంటే మన మనసుకు వెంటనే తట్టే పాట ఇదే... ఈ పాటలోని ఒక లైన్ విన్న సి. నారాయణ రెడ్డి ఆ ఒక్క వ్యాక్యం వెయ్యి వాక్యాల పెట్టు అన్నారంటే ఆయన మనసు ఎంత లోతైనదో అర్ధమౌతుంది.

 

మనసుని ఏ దిశలో ఏ దశలో ఏ విధంగా పోగొట్టుకున్నారోగాని.. పోగొట్టుకున్న మనసు వెతికే వెంపర్లాటలో వచ్చిన ఆలోచనలను చిన్న చిన్న పదాలతో, తేలికగా అర్థమయ్యే లా రాసిన కవి ఆత్రేయ. ఆర్తి.. ఆవేదన.. ఆశ.. ఆందోళన.. అభిమానం.. అనురాగం.. ఆప్యాయత అన్ని కలగలిపి మళ్ళీ మళ్ళీ పాడుకునేలా మనసు మీద గీతాలు రాసి మనసుకవి అనిపించుకున్నారాయన.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: