సినిమా షూటింగ్ లు ఆగిపోయిన దగ్గర నుండి ప్రస్తుతం ఇండస్ట్రీ దృష్టి అంతా ‘ఆర్ ఆర్ ఆర్’ పైనే ఉంది. ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుంది అన్న ఆసక్తితో పాటు ఈ మూవీకి జరగబోయే బిజినెస్ ను బట్టి విడుదల తరువాత వచ్చే కలక్షన్స్ ను బట్టి భవిష్యత్ లో తెలుగులో భారీ సినిమాల నిర్మాణం ఆధారపడి ఉంటుంది. 


ఇలాంటి పరిస్థితులలో నిన్న రాజమౌళి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆర్ ఆర్ ఆర్’ రీ షెడ్యూల్ కు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి చరణ్ జూనియర్ లపై చాల సన్నివేశాలు చిత్రీకరించ వలసి ఉన్నాయబి చెపుతూ ఆ సన్నివేశాలకు సంబంధించి ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులు అవసరం ఎంతవరకు భారీ సెట్స్ అవసరం వీలైనంత తక్కువ మందితో రిచ్ గా ‘ఆర్ ఆర్ ఆర్’ ను ఎలా తీయవచ్చు అన్న విషయమై ప్రస్తుతం తన ఆలోచనలు ఉన్నాయని అంటున్నాడు. 


వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించిన టెక్నిషియన్స్ నటీనటులు చాలమంది విదేశాల నుంచి రావలసి ఉందనీ అదేవిధంగా ఈ సినిమా కోసం వేయవలసిన భారీ సెట్స్ నిర్మాణానికి చాలామంది కార్మికులు మిగతా రాష్ట్రాల నుండి రావాలని ఇది అంతా భారీ ఖర్చుతో కూడుకున్న పని అనీ ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించిన అన్ని పనులలో స్థానికంగా ఉండే ప్రతిభావంతులతో ‘ఆర్ ఆర్ ఆర్’ తీయబోతున్న విషయాన్ని వెళ్ళడించాడు. తనకు సవాళ్లు అంటే బాగా ఇష్టం అని సవాళ్లు ఎదురైనప్పుడే ఏవ్యక్తి అయినా మరింత కష్టపడతాడు అంటూ కామెంట్ చేసాడు.


కరోనా పరిస్థితుల నేపధ్యంలో ఫిలిం ఇండస్ట్రీలో అనేక మార్పులు జరగబోతున్నాయని సినిమాకు సంబంధించిన అనవసరపు ఖర్చులు తారలకు సంబంధించిన అనవసరపు లగ్జరీలు అదేవిధంగా వారి భారీ పారితోషికాలు తగ్గి తీరుతాయని అలా సహకరించే వారితోనే రానున్న రోజులలో సినిమాలు ఉంటాయని కామెంట్స్ చేసాడు. కరోనా సమస్యలు వల్లఏర్పడ్డ ఆర్ధికమాంద్యం వల్ల డబ్బుకు సమస్యలు ఏర్పడవచ్చు కానీ మనిషి లోని క్రియేటివ్ ఆలోచనలకు ఆర్ధికమాంద్యం అడ్డకట్ట వేయలేదు అంటూ రాజమౌళి షాకింగ్ కామెంట్స్ చేసాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: