తెలుగు సూపర్ స్టార్ మ‌హేష్‌బాబు అనగానే సూప‌ర్‌స్టార్ కృష్ణ రూపాన్ని, న‌ట‌వార‌స‌త్వాన్ని పునికిపుచ్చుకున్న తేజస్సుతో క‌నిపిస్తాడు. ఇక కృష్ణ మొద‌టి భార్య ఇంద్రాదేవి మ‌హేష్‌బాబు త‌ల్లి. కృష్ణ త‌న మేన‌మామ కూతురు మ‌ర‌ద‌లినే వివాహం చేసుకున్నారు. ఆ త‌ర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల విజ‌య‌నిర్మ‌ల‌ను రెండ‌వ వివాహం చేసుకున్నారు. కృష్ణగారి మాట‌ల‌ను గౌర‌వించిన మ‌హోన్న‌త‌మైన మ‌నిషి. ఇక ఇంద్రాదేవిగారు మీడియా కంట ప‌డ‌డం చాలా త‌క్కువ సినీ ఫంక్ష‌న్ల‌కు అస్స‌లు రారు. కృష్ణ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టేస‌రికే ఇంద్రాదేవితో వివాహం జ‌రిగింది. ఇక కృష్ణ ఇందిర‌ల‌కు ఇద్ద‌రు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. 

 

 

 

విజ‌య‌ నిర్మ‌ల‌తో కృష్ణ‌కు వివాహం జ‌రిగిన‌ప్ప‌టికీ ఇంద్ర‌దేవి కృష్ణ‌తో క‌లిసి పిల్ల‌ల‌ను క‌న్నారు. ఇక విజ‌య‌నిర్మ‌ల‌, ఇంద్రాదేవి కూడా బాగానే ఉండేవారు. ఇక ఇంద్రాదేవి మొద‌టి కుమారుడు ర‌మేష్ ఇటు హీరోగా అటు ప్రొడ్యూస‌ర్‌గా  పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించగా..మ‌హేష్‌బాబు సూప‌ర్‌స్టార్ హీరోగా మంచి ప్ర‌ఖ్యాత‌లు సంపాదించారు. ఇక మ‌హేష్‌బాబుకి వాళ్ళ అమ్మ ఇంద్రాదేవి అంటే చాలా ఇష్టంచాలా ఇస్తామన్నా సంగతి తెలిసిందే. ఇక మ‌హేష్ కూతురు సితార కూడా సేమ్ ఇంద్రాదేవి పోలిక‌ల‌ను క‌లిగి ఉంటుంది. ఇంద్ర‌దేవి అంటే మ‌హేష్‌కి ప్రాణం. ఇప్ప‌టికీ చిన్న‌పిల్లాడిలా వాళ్ళ అమ్మ‌ను అస‌లు వ‌దిలిపెట్ట‌డు...
 


 

 

ఇక మ‌హేష్ ఇంద్రాదేవితో ఎంత ప్రేమ‌గా ఉండేవాడో విజ‌య‌నిర్మ‌ల‌గారిని కూడా అంతే ప్రేమించేవారు... ఆమెను కూడా ఉన్నంత‌వ‌ర‌కూ ఎంతో గౌర‌వంగా చూసేవారు మ‌హేష్‌. అలాగే విజ‌య‌నిర్మ‌ల‌కి కూడా మ‌హేష్ అంటే ఎంతో అభిమానంతో ఉండేవారు. ఆయ‌న పిల్ల‌ల‌ను కూడా చాలా ప్రేమ‌గా ద‌గ్గ‌ర‌కు తీసుకుని చూసేవారు విజ‌య‌నిర్మ‌ల‌. అన్ని విధాలుగా సర్దుకుపోయే మనస్తత్వం ఆడవాళ్ళకే ఎక్కువ‌గా ఉంటుంది. అలాంటి మంచి మ‌న‌స్త‌త్వం క‌లిగిన వ్య‌క్తే ఇందిరాదేవి. ఒక వేళ మ‌హేష్‌బాబు ఏద‌న్నా సినిమాఫంక్ష‌న్ల‌కు ఇందిరాదేవి క‌నుక వస్తే మ‌హేషే ద‌గ్గ‌రుండి మ‌రీ ఆమె చేయి ప‌ట్టుకుని చాలా జాగ్ర‌త్త‌గా తీసుకువ‌స్తారు. ఆమెను ఎంతో జాగ్ర‌త్త‌గా ఆప్యాయంగా చూసుకుంటారు. అమ్మను ప్రేమించే వాళ్ళు పెళ్ళాన్ని , పిల్లలను బాగా చూసుకుంటారు..అది ఇప్పుడు మహేష్ నిరూపించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: