అమ్మ.. అన్న రెండు అక్ష‌రాల ప‌దంలో ఎంత‌టి మాధుర్యం దొరుకుతుందో మాట్లో చెప్ప‌లేనిది. తొమ్మిది నెలలపాటు కడుపులో ఉన్న బిడ్డ కోసం తపస్సు చేసి శిశువుకు జన్మనిచ్చే తల్లి కోసం ప్రపంచ వ్యాప్తంగా మే 10(ఆదివారం) 2020  నాడు  మాతృదినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. వాస్త‌వానికి దేవుడు సృష్టించిన జీవులన్నింటిలోనూ.. ఏ విషయంలోనైనా భేదాలుండచ్చు కానీ, అమ్మ ప్రేమలో వ్యత్యాసం ఉండదు. మనిషి నుంచి మృగం వరకూ.. పిల్లల్ని సాకడంలో మాత్రం మాతృమూర్తికి తిరుగులేదు. అందుకే వంద దేవుళ్లే కలిసొచ్చినా అమ్మలాగా ఎవ్వరు చూడలేరు.. కోట్ల సంపదే కలిసొచ్చినా అమ్మ లాంటి ప్రేమ మనకు ఎక్కడా దొరకదు. అలాంటి తల్లి ప్రేమను ఎవ్వరూ వర్ణించలేరు.

 

అయితే, అమ్మగా ఆ పాత్రలో ఒదిగిపోయి వెండితెరపై చిరస్మరణీయంగా నిలిచిపోయేలా నటించారు కొందరు నటీమణులు. వారి న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు నీరాజ‌నం ప‌ట్టాడ‌రు. అలాంటి వారిలో మ‌నం ముందుగా చెప్పాల్సిన పేరు సీనియ‌ర్ న‌టి అన్న పూర్ణ. ఈమె హీరోయిన్ గా తన కెరీర్ ను ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు. దాదాపు సినీ పరిశ్రమలోని హీరో, హీరోయిన్లందరికీ తల్లిగా, బామ్మగా, అత్తగా నటించి.. ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా అక‌ట్టుకున్నారు. అంతే కాదు, ఆమె అలనాటి మేటి నటుల సరసన హీరోయిన్ గా చేసి తిరిగి వారికి తల్లిగా నటించడం మ‌రో విశేషం అని చెప్పుకోవాలి.

 

సుహాసిని.. తెలుగు ప్రేక్షకులకు పరిచడం అవసరం లేని పేరు.  తండ్రి చారు హాసన్‌ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న సుహాసిని సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలిగారు.  స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించిన సుహాసిని ఆ తర్వాత కెరెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా సత్తా చాటారు. ముఖ్యంగా పెదబాబు, గబ్బర్ సింగ్, లీడర్, వరుడు వంటి సినిమాల్లో తల్లి పాత్రలతో తనదైన ముద్రవేశారు.

 

జయసుధ.. సహజ నటి అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరయ్యా అంటే జయసుధ. పాత్రలకు జీవం పోసి స్టార్‌ హీరోలకు దీటుగా రాణించారు ఈమె. ఇక స్టార్ హీరోయిన్‌గానే కాకుండా తల్లిపాత్రల్లో తనదైన ముద్రవేశారు. హీరోయిన్ గా ఒకప్పుడు తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న జయసుధ తన సెకండ్ ఇన్సింగ్స్ ని తల్లి పాత్రలతో మొదలుపెట్టారు. ఈ క్ర‌మంలోనే కొత్తబంగారు లోకం, బొమ్మరిల్లు, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇలా ఎన్నో సినిమాల్లో హీరోకు త‌ల్లిగా ఒదిగిపోయారు. వీళ్లు మాత్రమే కాదు.. రాధిక, భానుప్రియ, రోజా, నగ్మా, దేవయాని, అమల, సుధ, ప్రగతి , మధుబాల, నదియా, శరణ్య, తులసి, రేవతి ఇలా న‌టీమ‌ణులు అమ్మ పాత్ర‌లో ఒదిగిపోయి న‌టించారు.
  
 

మరింత సమాచారం తెలుసుకోండి: