ఐశ్వర్య రాయ్ బచ్చన్ అంటేనే బాలీవుడ్ లో ప్రతి ఒక్కరూ చెవి కోసుకొంటారు. ఆమె అందచందాలు, నటన ప్రతిభ, అన్నిటికీ మించి తన మంచి మనసుకు కోట్లాది మంది అభిమానులను ప్రపంచవ్యాప్తంగా ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్.. ఏ ఇండియన్ ముద్దుగుమ్మకు లేదంటే అతిశయోక్తి కాదు. నిజానికి ఆమె సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండదు. కానీ తన వీరాభిమానులు ఇంస్టాగ్రామ్, ఫేసుబుక్ సోషల్ మీడియా మాధ్యమాలలో ఫ్యాన్ పేజీస్ క్రియేట్ చేసి ఆమెకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటో ను షేర్ చేస్తుంటారు. ఆమెకు సంబంధించిన అరుదైన ఫోటోలను కూడా వీరు పబ్లిష్ చేసి ఐశ్వర్య అభిమానులకు కన్నుల విందు చేస్తుంటారు.


ఇందులోని భాగంగానే తాజాగా ఐశ్వర్యరాయ్ ఆరాధ్య బచ్చన్, హాలీవుడ్ సింగర్ కామిలా కాబెల్లో దిగిన ఓ అరుదైన ఫోటో ని ఒక ఫ్యాన్ పేజీ వారు నెట్టింట పంచుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఫోటో మళ్లీ నెట్టింట వైరల్ అవుతుంది. గత ఏడాది ఫ్యాషన్ వీక్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఐశ్వర్యరాయ్, ఆరాధ్య బచ్చన్ కలిసి ప్యారిస్ వెళ్ళినప్పుడు... ప్రముఖ అమెరికన్ సింగర్ వీరితో కలిసి కొంత సమయాన్ని గడిపారు. ఆమె కామిలా కాబెల్లో... ఈమె 23 సంవత్సరాలకే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రముఖ కెనడియన్ సింగర్ షాన్ మెండీస్ తో ఈమె పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంది.


ఫోటో గురించి మాట్లాడుకుంటే... తల్లి బిడ్డ అయిన ఐశ్వర్య, ఆరాధ్య సింగర్ కామిలా తో కలిసి నవ్వుతూ ఫోటోలు దిగగా... కామిలా మాత్రం నాలుక బయట పెట్టి హాస్యాస్పదంగా ఫోటోకి ఫోజ్ ఇచ్చింది. ఐశ్వర్య ఆరాధ్య బచ్చన్ ఇద్దరూ నలుపు రంగు వస్త్రాలను ధరించగా... కామిలా పసుపు పచ్చ టాప్, బ్లూ జీన్స్ పాంట్స్ వేసుకుంది. ఇకపోతే ఐశ్వర్యరాయ్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నెగటివ్ పాత్రలో నటించనుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: