అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీనియర్ ఎన్టీఆర్ అంటే ఒక సాధారణ మనిషి కాదు ఆయనొక కారణజన్ముడు అనేంతలా అటు ప్రజలను తెలుగు ప్రేక్షకులను తెలుగు చిత్ర పరిశ్రమ ను ప్రభావితం చేశారు సీనియర్ ఎన్టీఆర్. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా ఎన్నో ఏళ్ల పాటు తన ప్రస్థానాన్ని కొనసాగించారు. ఇక నందమూరి తారక రామారావు తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కీలక మలుపులు.. ఎన్నో క్లిష్ట పరిస్థితులను కూడా చూసిన విషయం తెలిసిందే. 

 

 

 ఇక సీనియర్ ఎన్టీఆర్ పెళ్లి విషయానికి వస్తే.. సినిమాల్లోకి రాకముందే బసవతారకం ని వివాహం చేసుకున్నారు సీనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత కాలంలో సినిమాల్లోకి వచ్చిన తర్వాత... రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు... సీనియర్ ఎన్టీఆర్ కి లక్ష్మీ పార్వతి తో పరిచయం ఏర్పడింది. సీనియర్ ఎన్టీఆర్ ని ఎంతో అమితంగా దైవంగా ఆరాధించే లక్ష్మీపార్వతి... సీనియర్ ఎన్టీఆర్ గురించి తెలుసుకునేందుకు సీనియర్ ఎన్టీఆర్ దగ్గర కొన్ని రోజులపాటు వుంటుంది. ఇదే సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అప్పటికే లక్ష్మీపార్వతి కూడా పెళ్లి అయిపోయింది. 

 

 

 కానీ సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి ని పెళ్లి చేసుకోవాలని భావించిన సమయంలో... అప్పటికే పెళ్ళి చేసుకున్న లక్ష్మీపార్వతి సీనియర్ ఎన్టీఆర్ అంటే దైవంగా భావించడంతో సీనియర్ ఎన్టీఆర్ తో పెళ్లికి ఒప్పుకుంది. ఇక సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిపెళ్లి అటు తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పటికే పెళ్లయి ఎంతో మంది పిల్లలు ఉన్న ఎన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఖ్యాతిని గడించిన ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోవడం అది ప్రేమించి పెళ్లి చేసుకోవడం... పెళ్లయిన మరో మహిళను పెళ్లి చేసుకోవడం అప్పట్లో  సంచలనంగా మారింది. అయితే ఎన్టీఆర్ చివరి క్షణాల్లో కూడా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ కు తోడుగా ఉంది అని చెబుతూ ఉంటారు చాలా మంది విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: