2001వ సంవత్సరంలో విడుదలైన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్ తో కలసి నటించాడు రాజీవ్ కనకాల. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి మధ్య గట్టి స్నేహం ఏర్పడింది. దాదాపు ఇరవై సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వారిమధ్య స్నేహం ఇంకా పెరిగి పోతూ ఉందే కానీ అనువంత అయినా తగ్గడం లేదు. వీళ్ళిద్దరిలో బాగా ఎమోషనల్ అయ్యే గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఆ కామన్ థింగ్ కారణంగానే వారి మధ్య స్నేహం బలపడుతూ వస్తోంది. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తర్వాత తారక్ రాజీవ్ కలిసి జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో సినిమాల్లో నటించి ప్రేక్షక అభిమానులకు కన్నుల విందు చేశారు. ఈ రెండు చిత్రాల ప్రచారంలో ఆడియో ఫంక్షన్ లో, తదితర ఇంటర్వ్యూలలో పాల్గొన్న రాజీవ్ కనకాల జూనియర్ ఎన్టీఆర్ స్నేహ బంధం గురించి ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. వారి స్నేహం చూసిన ప్రతి ఒక్కరికీ ఎంతో ముచ్చట వేసిందంటే అతిశయోక్తి కాదు.


కేవలం సినిమాల వరకే వీరి స్నేహం పరిమితం కాలేదు. 2009వ సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయగా... అతడి వెన్నంటే ఉండి తను కూడా ప్రచారంలో పాల్గొన్నాడు. అదే ఎన్నికల ప్రచారంలో నల్గొండ జిల్లాలో ఎన్టీఆర్ కార్ కి ఆక్సిడెంట్ జరగగా... తారక్ తో పాటు ఆయన కూడా కార్లోనే ఉండగా అతనికి కూడా గాయాలయ్యాయి. నాగ సినిమా చిత్రీకరణలో ఓ ఫైట్ సన్నివేశంలో కూడా రాజీవ్ కనకాల జూనియర్ ఎన్టీఆర్ గాయపడే వారు కానీ అదృష్టవశాత్తు ఆ గండం నుండి ఎటువంటి గాయాలు అవ్వకుండా తప్పించుకున్నారు.


రాజీవ్ కనకాల అమ్మ గారు చనిపోయిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ బాగా ఏడ్చాడు. రాజీవ్ ఇంటికి వెళ్లే తన తల్లికి నివాళులర్పించి ధైర్యం చెప్పాడు. రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మి చిన్న వయస్సులోనే చనిపోవడం అందర్నీ కలచివేసింది. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజీవ్ కనకాల కి ఫోన్ చేసి బాగా ఓదార్చాడు. వీళ్లిద్దరూ పేరుకి స్నేహితులైన ఓ తల్లికి పుట్టిన అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారు. ఏదేమైనా టాలీవుడ్ పరిశ్రమలోని అందరి స్నేహ బంధాల లో వీరి ఫ్రెండ్షిప్ టాప్ ప్లేస్ లో నిలుస్తుందని నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: