ఇప్పుడు అవకాశాల కోసం కొందరు హీరోయిన్ లు చాలా వరకు కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఒక్క అవకాశం వస్తే చాలు అనుకుని నిర్మాతలు దర్శకుల చుట్టూ ఎంతో కస్టపడి తిరుగుతున్నారు. ఇక ఇప్పుడు ఒక మాజీ హీరోయిన్ అయితే ఏకంగా సినిమాలో ఛాన్స్ ఇస్తే తాను పారితోషికం తీసుకొను అని చెప్పినట్టు సమాచారం. సినిమా హిట్ అయితేనే తీసుకుంటాను అని చెప్పింది అని అంటున్నారు. దీనిని బ‌ట్టి ఇప్పుడు ఆ హీరోయిన్ ప‌రిస్థితి ఎలాంటి స్థితిలో ఉందోఅర్థం చేసుకోవ‌చ్చు.

 

టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ ఇలియానా ఇప్పుడు మన తెలుగులో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. 2005లో వ‌చ్చిన వైవీఎస్ చౌద‌రి దేవ‌దాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ త‌ర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. మ‌హేష్ బాబు పోకిరి ఆమెను ఇక్క‌డ తిరుగులేని స్టార్ హీరోయిన్‌ను చేసేసింది. అయితే ఇక్క‌డ ఫుల్ స్వింగ్‌లో ఉండ‌గానే బాలీవుడ్ స్టార్ అవ్వాల‌ని అక్క‌డ‌కు వెళ్ల‌డంతో ఆమె కెరీర్ ఇక్క‌డ ఆగిపోయింది.

 

ఆమె ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలో చేయడానికి గానూ కాస్త ఎక్కువగా కష్టపడుతోంద‌ట‌. అతను చేసే నానీ సినిమాలో ఆమె హీరోయిన్ గా ఛాన్స్ కోసం ప్రయత్నం చేస్తుంది అని సమాచారం. ఇది ఎంత వరకు నిజం అనేది పక్కన పెడితే దీని గురించి ఇప్పుడు చర్చ కూడా జరుగుతుంది. తాను లిప్ లాక్ కి అయినా సరే ఓకే అని ఆమె చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. మరి దర్శక నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి. 

 

ఆమె ప్రస్తుతం ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండటానికి ఆసక్తి చూపిస్తుంది అని సమాచారం. ఇక ఆమె త‌న బాయ్ ఫ్రెండ్ నుంచి కూడా విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇక ఆమె నాని ప‌క్క‌న చేసే అంశంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి త్రివిక్రమ్ అవకాశం ఇస్తాడో లేదో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: