జూనియర్ ఎన్టీఆర్ పై సీరియస్ అయిన డైరెక్టర్ కూడా ఉంటారా? అని మీరు ప్రశ్నిస్తే సమాధానం అవుననే చెప్పాలి. తారక్ పై ఆ డైరెక్టర్ ఎంతగా సీరియస్ అయ్యాడు అంటే... తారక ఉన్నఫలంగా షూటింగ్ ప్లేస్ నుండి తన ఇల్లు వచ్చేంత వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడట. మళ్లీ ఆ డైరెక్టర్ తారక్ ఇంటికి వెళ్లి బుజ్జగించి షూటింగ్ ప్రాంతానికి తీసుకువచ్చి చిత్రీకరణ జరిపారట. అయితే డైరెక్టర్ తారక్ పై సీరియస్ అయిన విషయం అక్షరాల నిజమే కానీ ఇది అతడి చిన్నతనంలో చోటుచేసుకుంది. 


పూర్తి వివరాలు చూసుకుంటే... 1996లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం సినిమాలో తారక్ రాముడి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించగా... సీత పాత్రలో స్మితామాధవ్ నటించారు. రాముడు మంచి బాలుడు కానీ రాముడి పాత్రలో నటించిన తారక్ మాత్రం బాగా అల్లరి చేసేవాడు. అతడి అల్లరిని ఎవరు భరించలేక పోయేవారు. ఇంట్లో ఉన్నా స్కూల్లో ఉన్నా మరే ఇతర ప్రదేశాల్లో ఉన్నా అతను అల్లరి మాత్రం చేయకుండా ఉండలేక పోయేవాడు. బాల రామాయణం సినిమా షూటింగులో కూడా జూనియర్ ఎన్టీఆర్ బీభత్సమైన అల్లరి చేసేవాడు.


ఆ సినిమాలోని నటులంతా చిన్నపిల్లల కావడంతో... జూనియర్ ఎన్టీఆర్ అల్లరి ఇంకా శృతి మించి పోయింది. షూటింగ్ కోసం తెచ్చిన బాణాలను విరగగొట్టటం... వానర సైన్యం పై సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో తోటి నటులకు బాణాల గుచ్చడం, తోక లాగడం, మూతులు పీకడం లాంటి అల్లరి పనులను చేసేవాడు. ఒకరోజు తన అల్లరి హద్దులు దాటి పోయింది. సినిమాలోని ఒక సన్నివేశం కోసం తెచ్చిన శివధనస్సును తీసుకున్న ఎన్టీఆర్ దాంతో కాసేపు ఆడుకుని చివరికి విరగ్గొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు గుణశేఖర్ ఎన్టీఆర్ వద్దకు వచ్చి గట్టిగా మందలిస్తూ విపరీతంగా సీరియస్ అయ్యాడు. దాంతో బాగా అలిగిన ఎన్టీఆర్ అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సాక్షాత్తూ గుణశేఖరే ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి అతడిని బుజ్జగించి మళ్లీ తన చిత్రంలో నటింపజేసాడు. ఏది ఏమైనా ఎన్టీఆర్ ఈ చిత్రంలో చాలా అద్భుతంగా నటించి... దర్శకుడు గుణశేఖర్ కి నేషనల్ అవార్డు వచ్చేలా చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: