జూనియర్ ఎన్టీఆర్... ఈ పేరుకు టాలీవుడ్ లో వెయిట్ చాలా ఎక్కువ. నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన  జూనియర్ ఎన్టీఆర్.. మొదటి సినిమా నుంచి మొన్నటి వరకు ప్రేక్షకులు అలరిస్తూ ఎన్నో వైవిద్యాత్మకమైన  పాత్రల్లో నటిస్తూ ఎంతగానో గుర్తింపు సంపాదించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలలో  జూనియర్ ఎన్టీఆర్ ఒకరు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి ప్రస్తుతం అభిమానులు కూడా చాలా ఎక్కువే . కేవలం నటనతో మాత్రమే కాదు అతను డాన్స్ పర్ఫార్మెన్స్ లో కూడా ఎంతో మంది ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి  ఆకట్టుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. 

 

 ఇక మహా మహా డాన్స్ మాస్టర్ లు సైతం జూనియర్ ఎన్టీఆర్తో ఒక్క స్టెప్  వేస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ లో అంత ఎనర్జీ ఉంటది మరి. తనలో ఉన్న ఎనర్జీని తన మాటలతో చేష్టలతో ఇతరులలో నింపుతూ ఉంటారు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ డాన్స్  విషయానికి వస్తే ఎలాంటి స్టెప్  అయినా ఇట్టే చేస్తూ ఉంటాడు.. ఇక జూనియర్ ఎన్టీఆర్ డాన్సుల్లో  ఎప్పుడూ ఎనర్జీ డ్రాప్  అవ్వకుండా ఫుల్ ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ మాస్టర్ లు కంపోస్ చేసే స్టెప్స్ కూడా ఎంతో కష్టంగా ఉంటాయి . ఇక జూనియర్ ఎన్టీఆర్ తో సరి సమానంగా డాన్స్ చేయడానికి పక్కన ఉన్న సైడ్ డాన్సర్స్  సైతం ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ లో ఎంతలా  ఇరగ దీస్తారు అర్థం చేసుకోవచ్చు. 

 

 అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో అంత సింపుల్గా డాన్సులు ఇరగదీసెయ్యడానికి అసలు కారణం ఒకటే వుంది అంటూ ఒక టాక్  వినిపిస్తూ ఉంటుంది. అదే జూనియర్ ఎన్టీఆర్ భరత నాట్యం నేర్చుకోవడం. జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడే  భరత నాట్యం నేర్చుకునే.. భరతనాట్యంలో సిద్ధ హస్తుడిగా గా మారిపోయాడు. భరతనాట్యంలో అద్భుతంగా నాట్యం చేసేవారు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ టాలెంట్ చూసి తాత సీనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్నోసార్లు మురిసిపోయారు. అయితే ఆనాడు భరత నాట్యం నేర్చుకోవడం వలనే నేడు సింపుల్ గా ఎలాంటి స్టెప్ అయిన  చేయగలుగుతున్నారు అని  టాక్ కూడా ఉంది. వాస్తవంగా అయితే జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లలో కొంచెం క్లాసికల్ టచ్  కూడా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: