నాని కెరియర్ కు సంబంధించి 25వ సినిమాగా విడుదలకు రెడీగా ఉన్న ‘వి’ మార్చి నెలలో ఉగాది పండుగ రోజున విడుదల కావలసి ఉంది. అయితే కరోనా సమస్యతో ధియేటర్లు మూతపడటంతో ఈ మూవీ విడుదల సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది.


దేశంలోని అన్ని రాష్ట్రాలలోను కరోనా సమస్య అదుపులోకి వచ్చిన తరువాత మాత్రమే ధియేటర్లను తిరిగి ఓపెన్ చేయాలి అన్న ఆలోచనలు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేస్తోంది అని వార్తలు వస్తున్న పరిస్థితులలో ‘వి’ విడుదల కావడానికి మరికొన్ని నెలలు పట్టినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి పరిస్థితులలో రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాల దర్శక నిర్మాతలు తమ సినిమాల భవిష్యత్ ఏమిటో తెలియక తెగ టెన్షన్ పడుతున్నారు.


అయితే ‘వి’ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మాత్రం ‘వి’ విడుదల ఆగిపోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది అంటూ కామెంట్ చేసాడు. వాస్తవానికి ‘వి’ మూవీని మార్చి 25న విడుదల చేద్దాము అని భావిస్తే మార్చి 20నుండి ధియేటర్లు మూత పడటంతో ‘వి’ రిలీజ్ కాకుండా ఆగిపోయింది. అలా కాకుండా అనుకున్న డేట్ కు ‘వి’ విడుదలై మార్చి నెలాఖరి నుండి ధియేటర్లు మూత పడి ఉంటే తమ పరిస్థితి ఏమిటి అంటూ ఇంద్రగంటి మోహన్ కృష్ణ తన సినిమా విడుదల అవ్వకపోవడం తన అదృష్టం అని అంటున్నాడు.


అంతేకాదు ఒటీటీ ప్లాట్ ఫామ్ పై ‘వి’ ని విడుదల చేసే ఉద్దేశ్యం తమకు లేదనీ ధియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులకు ఇచ్చే కిక్ ఒటీటీ రిలీజ్ లో విడుదలైన సినిమాలు ప్రేక్షకులకు కిక్ ను కలిగించవు అని అంటున్నాడు. అయితే ‘వి’ మూవీ పై దిల్ రాజ్ సుమారు 30 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి పూర్తిగా చిక్కుకున్నాడు అని వార్తలు వస్తున్న పరిస్థితులలో ఇంకా కరోనా సమస్యలు కొనసాగి ధియేటర్లు తెరుచుకోవడం మరో మూడు నాలుగు నెలలు సమయం పడితే అంతకాలం ‘వి’ ఒటీటీ ఫ్లాట్ ఫామ్ ల ఆఫర్లను తప్పిచుకుని నిలబడగలుగుతుందా అన్నదే సందేహం..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: