తెలుగు చిత్ర పరిశ్రమలో రష్మిక మందన కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ అమ్మడు అందం అభినయానికి ఫిదా అవ్వని తెలుగు  ప్రేక్షకులు లేడు అనడంలో అతిశయోక్తి లేదు. ఎక్కడ అందాల ఆరబోతకు తావు ఇవ్వకుండా కేవలం తన అభినయంతో నే ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగింది  రష్మిక మందన. చలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తక్కువ సమయంలోనే తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగింది . చలో సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీతగోవిందం సినిమాలో ఛాన్స్ కొట్టేసింది రష్మిక మందన. ఈ సినిమాలో గడుసు పిల్లగాడా రష్మిక మందన నటన ఎంతగానో ఆకట్టుకుంది అని చెప్పాలి. 

 

 

 తన అందం అభినయంతో కూడా ఎంతగానో ఆకట్టుకుంది రష్మిక మందన. ఇక ఈ సినిమా  ఎంత ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ రేసులోకి వెళ్ళిపోయింది రష్మిక మందన్న. కేవలం రష్మిక మందన్న చేసింది  రెండు సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు సంపాదించుకుంది . ఇక ఆ తర్వాత మరోసారి విజయ్ దేవరకొండ తో డియర్ కామ్రేడ్ అనే సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే మొదటి నుంచి లిప్లాక్ సన్నివేశాల్లో నటించడానికి ఓకే చెప్పినా...  అందాల ఆరబోత మాత్రం ఎక్కడా చేయలేదు ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. 

 


 ఈ సినిమా ఘన విజయం సాధించడంతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది రష్మిక మందన. అయితే రష్మిక మందన కెరీర్లో రష్మిక కు మంచి గుర్తింపు తెచ్చిన పాట మాత్రం ఒకటే ఉంది. అదే సరిలేరు నీకెవ్వరు సినిమాలోని హీ సో  క్యూట్ పాట. ఈ పాట టాలీవుడ్ లో ఎంత సెన్సేషన్ సృష్టించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాటలో రష్మిక మందన తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో కూడా అదరగొట్టింది. కాగా ఇప్పటి వరకు రష్మిక మందన చేసిన సినిమాల్లో ఉన్న పాటల్లో  మంచి గుర్తింపు తెచ్చిన పాట ఇది ఒకటే అని చెప్పాలి.హీ  సో క్యూట్ అనే సాగిపోయే పాటలో రష్మిక మందన తన అందం అభినయంతో పాటు డాన్స్ పర్ఫార్మెన్స్ లతో కూడా ఆకట్టుకుంది. ఈ పాట తెలుగు ప్రేక్షకులకు రష్మిక మందన ను మరింత దగ్గర చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: